Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ చేయలేనిది బాలకృష్ణ చేశారట..

By:  Tupaki Desk   |   27 Dec 2016 3:57 PM IST
ఎన్టీఆర్ చేయలేనిది బాలకృష్ణ చేశారట..
X
గౌతమీపుత్ర శాతకర్ణి... బాలకృష్ణ 100వ చిత్రంగా ఇప్పుడు జనం నోళ్లలో నానుతున్న ఈ పేరు వెనుక ఎంతో చరిత్ర ఉంది. భారత దేశ చరిత్రలో గొప్ప చక్రవర్తుల్లో ఒకరు. అలాంటి మహనీయుని పాత్ర పోషించాలని అప్పట్లో ఎన్టీఆర్ అనుకున్నా కూడా కారణాంతరాల వల్ల సాధ్యం కాలేదట.. ఇప్పుడు బాలకృష్ణ ఆ లోటు భర్తీ చేస్తున్నారు. ఈ విషయం స్వయంగా బాలయ్యే వెల్లడించారు. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన ఆయన ఆ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ సినిమా గురించి ముచ్చటించారు. ‘‘ఆ చల్లని సముద్రగర్భం దాచిన బడబానలమెంతో.. ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో’’ అన్న దేవులపల్లి కవితను గుర్తు చేసుకున్న ఆయన అలా.. చరిత్ర పుటలకెక్కిన సూర్యతేజస్సు గల గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చేయడం తన అదృష్టమని చెప్పారు. శాతకర్ణి చరిత భావితరాలకు అందించాలన్నఉద్దేశంతో ఈ సినిమాలో నటిస్తున్నట్లు చెప్పారు.

కాగా శాలివాహన వంశానికి చెందిన గౌతమీపుత్ర శాతకర్ణి వ్యక్తిత్వం చాలా విశిష్టమైంది. ఆయన చిత్రాలున్న నాణేల ఆధారంగా చూస్తే శాతకర్ణి దృఢకాయుడని - స్ఫురద్రూపి అని తెలుస్తుంది. నాసిక్ శాసనం కూడా శాతకర్ణి గురించి గొప్పగా చెబుతుంది. జనరంజక పాలకుడని... వీరోచిత పోరాటయోధుడని అందులో వర్ణించారు. అలాంటి గొప్ప చక్రవర్తి పాత్ర పోషించడం ఈకాలం హీరోల్లో బాలకృష్ణకే కరెక్టుగా సరిపోతుందని సినీ ఇండస్ర్టీ కూడా అంటోంది.

కాగా ఇప్పటికే ఆడియో రిలీజ్ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందకు రావడానికి రెడీ అవుతోంది. సినిమా ట్రయలర్ - బాలయ్య స్టిల్సు అన్నీ ఇప్పటికే హల్ చల్ చేస్తున్న నేపథ్యంలో సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం గ్యారంటీ అని బాలయ్య అభిమానులు అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/