Begin typing your search above and press return to search.

పాతిక త‌గ్గాలి..బాల‌య్య క‌ఠోర ల‌క్ష్యం

By:  Tupaki Desk   |   3 Oct 2019 4:57 AM GMT
పాతిక త‌గ్గాలి..బాల‌య్య క‌ఠోర ల‌క్ష్యం
X
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి సినిమా కోసం సీరియ‌స్ గా క‌స‌ర‌త్తులు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఓవైపు ప్రీప్రొడ‌క్ష‌న్ క‌స‌ర‌త్తు.. మ‌రోవైపు జిమ్ లో క‌స‌ర‌త్తులు చాలా సీరియ‌స్ గా సాగుతున్నాయ‌ట‌. సింహా - లెజెండ్ లాంటి బ్లాక్ బ‌స్టర్లు ఇచ్చిన బోయ‌పాటి శ్రీ‌ను ఈసారి బాల‌య్య‌ను మ‌రో కొత్త కోణంలో చూపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని తెలుస్తోంది. న‌ట‌సింహా ఇమేజ్ కి ఏమాత్రం త‌గ్గ‌ని స్క్రిప్టుతో ఆయ‌న సెట్స్ కు వెళుతున్నారు. ఇక ఈ చిత్రంలో మునుప‌టి సినిమాల త‌ర‌హాలోనే బాల‌య్య బాబులో డ్యూయ‌ల్ షేడ్ క‌నిపించేందుకు ఆస్కారం ఉంద‌ని లీకులు అందుతున్నాయి.

అందుకే బాల‌య్య రెండు ర‌కాల గెట‌ప్పుల‌కు త‌గ్గ‌ట్టు మారాల్సి ఉంటుందని తెలుస్తోంది. ప్ర‌స్తుతం జిమ్ లో క‌స‌ర‌త్తుల‌తో బాల‌య్య బాబు మోత మోగిస్తున్నారని తెలిసింది. ఇప్ప‌టికే కె.ఎస్.ర‌వికుమార్ చిత్రంలో కొత్త లుక్ కి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. సూటు బూటు వేసిన‌ స్లిమ్ బోయ్ ట్రిమ్ బోయ్ లా మ‌రిపిస్తున్నారు బాల‌కృష్ణ‌. ఆ ఫోటోల‌కు అభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. అంత‌కుమించి బోయ‌పాటి సినిమాలో బాల‌య్య క‌నిపిస్తార‌ని అంటున్నారు. ఇప్ప‌టికే 15కేజీలు త‌గ్గారు. మ‌రో 10కేజీల మేర త‌గ్గుతార‌ట‌. అంటే మొత్తం 25కేజీల బ‌రువు త‌గ్గే ఛాలెంజ్ ని బాల‌కృష్ణ స్వీక‌రించార‌ట‌. అందుకోసం జిమ్ లో నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు. అన్నం త‌గ్గించి చ‌పాతీ- పుల్కాల్ని ఆశ్ర‌యిస్తున్నార‌ట‌.

అయితే లేటు వ‌య‌సులో ఏమిటీ ఈ క‌సి..? 59 ఏజ్ కి చేరిన బాల‌య్య ఇంత హార్డ్ వ‌ర్క్ చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌ని అభిమానుల్లో చ‌ర్చ సాగుతోంది. అయితే ఆయ‌న స‌మకాలికులైన మెగాస్టార్ చిరంజీవి- కింగ్ నాగార్జున 60లోనూ అంతే హార్డ్ వ‌ర్క్ చేస్తూ న‌వ‌యుకుల్లా చెలామ‌ణి అవుతున్న సంగ‌తి తెలిసిందే.