Begin typing your search above and press return to search.
ఆలస్యానికి క్షమాపణ కోరిన నటసింహం
By: Tupaki Desk | 26 April 2021 3:30 AM GMTనటసింహా నందమూరి బాలకృష్ణ మంచితనం గురించి నమ్మకాల గురించి సోషల్ మీడియాల్లో విస్త్రతంగా చర్చ సాగుతుంటుంది. ఒకరికి మాటిస్తే అది నెరవేర్చే మంచి గుణం ఆయన సొంతం. ఒకసారి దర్శకుడిని లాక్ చేస్తే ఇక ఆయన పనిలో వేలు పెట్టే ప్రసక్తే లేదు. చిన్నపిల్లాడి తత్వంతో అందరితో కలిసిపోతారు.. సెట్లో అందరితో మంచిగా ఉంటారని కూడా చెబుతారు. కొన్నిసార్లు ఆయన షార్ట్ టెంపర్ పై రకరకాలుగా ప్రచారం సాగినా.. దగ్గరగా చూసిన నటులెవరూ దానిని ధృవీకరించలేదు.
అలాగే పొరపాటు జరిగితే ఈగో లేకుండా సారీ చెప్పే నైజం బాలయ్యబాబుకు ఉందని చెబుతారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సీనియర్ సినీజర్నలిస్ట్ వినాయకరావు బాలయ్య బాబు గురించి ఒక ఆసక్తికర విషయం వెల్లడించారు.
బాలకృష్ణ తండ్రి గారు.. నవరసనటసార్వభౌముడు ఎన్.టి.ఆర్ పై రెండు పుస్తకాలు రాసిన ఆయన తన మొదటి పుస్తకం పూర్తి చేసిన తరువాత బుక్ లాంచ్ కోసం బాలకృష్ణను సంప్రదించానని తెలిపారు. కోరగానే బాలయ్య వెంటనే అంగీకరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్ నారాయణ మూర్తి- డాక్టర్ రామానాయుడుతో పాటు ఇతర ప్రముఖులు కూడా వేదికపై ఉన్నారు. కానీ బాలయ్య రాలేదు.
దాసరి నారాయణరావు దర్శకత్వంలో `పరమ వీర చక్ర` షూటింగ్ లో బిజీగా ఉన్నందున ఈ కార్యక్రమానికి బాలయ్య ఆలస్యంగా వచ్చారు. అందరూ అతని కోసం వేచి ఉండాల్సి వచ్చింది! కానీ ఆయన వచ్చిన వెంటనే వేదికపై ప్రతి ఒక్కరికి తన ఆలస్యానికి కారణం చెబుతూ.. క్షమాపణలు చెప్పి పుస్తకావిష్కరణ చేశారు. అది ఎప్పటికీ మరచిపోలేనని రచయిత జర్నలిస్ట్ వినాయక రావు చెప్పారు.
నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో అఖండ చిత్రీకరణలో ఉన్నారు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్ కు యూట్యూబ్ లో అద్భుత స్పందన వచ్చింది. మే 28న ఈ చిత్రం విడుదల కానుంది. మహమ్మారీ కారణంగా చిత్రీకరణ ఆలస్యమవుతోంది. విడుదల ఆలస్యమవుతుందని ఊహాగానాలు సాగుతున్నా.. ఏం జరగనుందో వేచి చూడాలి.