Begin typing your search above and press return to search.
29 నంది పురస్కారాలు పొందిన ఏకైక వ్యక్తి
By: Tupaki Desk | 25 Sep 2020 5:30 PM GMTకళాకారుడికి ఒక్కటి లేదా రెండు అవార్డులు వస్తేనే చాలా గొప్ప విషయం. అలాంటిది దివంగత ఎస్పీ బాలసుబ్రమణ్యం కు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎన్నో పురస్కారాలు లభించాయి. నాలుగు పదుల సంగీత ప్రస్థానంలో ఆయన 6 సార్లు జాతీయ అవార్డును దక్కించుకున్నారు. ఏడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు. 1979 లో వచ్చిన తెలుగు సినిమా శంకరాభరణం సినిమాకు గాను బాలుకు జాతీయ అవార్డు లభించింది. సాగర సంగమం మరియు రుద్రవీణ సినిమాలు కడా బాలు గారికి జాతీయ అవార్డును తెచ్చి పెట్టాయి. గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా.. నటుడిగా.. సంగీత దర్శకుడిగా కూడా ఆయన సినిమాలకు సేవనందించారు.
ఏపీ ప్రభుత్వం నుండి ఎస్పీ బాలసుబ్రమణ్యంకు 29 నంది పురస్కారాలు దక్కాయి. గాయకుడిగా 25 సార్లు నంది అవార్డును సొంతం చేసుకోగా మరో నాలుగు నంది అవార్డులు డబ్బింగ్ ఆర్టిస్టుగా నటుడిగా సంగీత దర్శకుడిగా నంది పురస్కారాలను బాలు పొందారు. తెలుగు సినిమా చరిత్రలో ఆ స్థాయి పురస్కారాలు మరెవ్వరు పొందలేదు. కేవలం ఏపీ ప్రభుత్వం అవార్డులు మాత్రమే కాకుండా తమిళ మరియు కన్నడ రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులను సైతం బాలు అందుకున్నారు.
వందల సంఖ్యలో ఆయన అవార్డులను ప్రతిష్టాత్మక పురస్కారాలను పొందారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ను 2001లో పద్మశ్రీ.. 2011లో పద్మభూషన్ తో గౌరవించింది. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. భారతదేశ ప్రతిష్టాత్మక అవార్డు 'భారతరత్న' ను బాలుకు ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.