Begin typing your search above and press return to search.
న్యాయం చేయలేకపోతే పాడడం వదిలేస్తా
By: Tupaki Desk | 23 Dec 2015 7:30 AM GMT69 వయసు.. 50 సంవత్సరాల కెరీర్.. 40వేలు పైగా పాటలు.. 15 భాషల్లో గానాలాపన.. ఇదీ ఎస్పీ బాలు ట్రాక్ రికార్డ్. లెక్కకు మిక్కిలి సినిమాల్లో నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగానూ రంగ ప్రవేశం చేసిన రికార్డ్.. ఉంది. ఇటీవలే కెరీర్ పరంగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న బాలసుబ్రమణ్యం అలియాస్ బాలు ఎన్నో సంగతులు చెప్పారు. ముఖ్యంగా అతడు కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండడం వల్ల తన కుటుంబాన్ని పట్టించుకోలేకోయానని మదనపడడం టాలీవుడ్‌లో చర్చకు వచ్చింది.
కెరీర్ బిజీలో పడి కుటుంబాన్ని పిల్లల్ని సరిగా పట్టించుకోలేకపోయాను.. అంటూ బాలూ ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి కాని ఇంజనీరింగ్ విద్య గురించి, క్లాసికల్ నేర్చుకోలేకపోవడం గురించి ఎంతో బాధపడ్డారాయన. నిజమే ఐదు దశాబ్ధాలుగా అలుపెరగని యోధుడిగా బాలూ పూర్తిగా కెరీర్ కే అంకితమయ్యారు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి. అలా కెరీర్ కోసం కుటుంబ బాధ్యతలకు కాస్తంత దూరంగానే ఉండాల్సొచ్చిందని బాలు మాటల్ని బట్టి అర్థమవుతోంది. రోజూ 11 గంటల పాటు కేవలం పాటకే కేటాయిస్తారాయన. అంత బిజీ కళాకారుడు కాబట్టే కుటుంబానికి కాస్తంత దూరం కావాల్సొచ్చి ఉంటుంది. సక్సెస్ సాధించాలనుకున్న ఎవరికైనా ఇదే ఫార్ములా వర్తిస్తుంది.
ఏదో ఒకరోజు పాడలేకపోయాను. పాటకి న్యాయం చేయలేకపోయాను.. అని అనిపిస్తే ఇక పాడడం వదిలేస్తానని అన్నారు. 1966లో శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాతో గాయకుడిగా ఆరంగేట్రం చేసిన బాలు.. శంకరాభరణం - ఏక్ దూజే కే లియే .. సినిమాలతో టాప్ రేంజ్ గాయకుడిగా ఎదిగారు. రికార్డింగ్ సాయంత్రం 5 గంటలకు ఉందంటే.. అరగంట ముందే స్టూడియోకు చేరుకుంటానని ఆయన తెలిపారు. డైరెక్టర్ పెద్దవాళ్లా, చిన్నవాడా అనేది అతడికి సంబంధం లేదు. పాటే లోకంగా పనిచేయడమే తెలుసని అన్నారు.