Begin typing your search above and press return to search.

నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ టార్చ్ బేరర్ గా మారడం బాలయ్యకి ఇష్టం లేదా...?

By:  Tupaki Desk   |   11 Jun 2020 6:15 AM GMT
నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ టార్చ్ బేరర్ గా మారడం బాలయ్యకి ఇష్టం లేదా...?
X
నందమూరి తారకరామారావు తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టాడు. ఆయన నట వారసుడిగా బాలకృష్ణ 14 ఏళ్ళ వయసులో ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రి పేరు నిలబెడుతూ స్టార్ హీరోగా యువ హీరోలతో దూసుకుపోతున్నాడు. ఆ తర్వాత జెనరేషన్ లో తారకరత్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ లు టాలీవుడ్ కి హీరోలుగా పరిచమయ్యారు. వీరు కూడా తమదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా తాత పోలికలు పుణికి పుచ్చుకుని.. 16 ఏళ్ళ వయసులో ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారక్ ప్రస్తుతం టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు అదే కోవలో 22 ఏట అడుగుపెట్టిన నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం ఎప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేస్తానని బాలయ్య ఎప్పుడో ప్రకటించినా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. దాంతో ఇప్పుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ గురించి నంద‌మూరి అభిమానులు బాల‌య్య‌ను ప్ర‌శ్నిస్తున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ మోక్ష‌జ్ఞ ఎంట్రీకి భారీగా ప్లాన్స్ వేసుంచానని.. అద్భుతమైన స్క్రిప్ట్స్ కూడా తీసి పెట్టానని.. అన్ని కుదిరినప్పుడు లాంచ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నందమూరి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మోక్షజ్ఞదే అని పేర్కొన్నాడు. అయితే బాలయ్య వ్యాఖ్యలు చర్చకు దారితీసాయి.

ప్రస్తుతం టాలీవుడ్ లో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ నందమూరి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని బాలయ్య గుర్తించడం లేదా అంటూ పలువురు అనుమానం వ్యక్తం చేసుకున్నారు. నిజానికి ఎన్టీఆర్ వరుస సూపర్ హిట్స్ అందిస్తూ నందమూరి లెగసీని కాపాడుతున్నాడని.. ఒకానొక దశలో బాలయ్య వరుస ప్లాపులలో కురుకుపోయినప్పుడు నందమూరి లెగసీని కాపాడింది జూనియర్ ఎన్టీఆర్ అని చాలా మంది నందమూరి అభిమానుల అభిప్రాయం. నందమూరి ఫ్యామిలీకి టార్చ్ బేరర్ లా ఉన్న ఎన్టీఆర్ ని వదిలేసి నందమూరి నట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మోక్షజ్ఞదే అని బాలయ్య అనడంలో ఆంతర్యం ఏమిటని వారు డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన బాలయ్య అది తారక్ ఇష్టం అంటూనే ఫుల్ టైమ్ పాలిటిక్స్ అంటే అంత ఈజీ కాదని.. నేను నాన్నగారు రెండూ బ్యాలన్స్ చేసుకుంటూ వచ్చామని.. అది అందరికీ సాధ్యం కాదని చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా ఈ మధ్య వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న బాలయ్య ఎన్టీఆర్ గురించి ఏ ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావన తీసుకురాలేదు. కాకపోతే నందమూరి హీరోలతో మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమే అని మాత్రం స్టేట్మెంట్ ఇచ్చాడు. బాలయ్య ఎన్టీఆర్ ని దూరం పెడుతూ వస్తున్నాడనే కామెంట్ ఎప్పటి నుండో వస్తున్నదే. ఇది నిజమే అనుకునేలా వీరిద్దరూ పెద్దగా కలుసుకున్న సందర్భాలు కూడా లేవు. బాలయ్య తాజా వ్యాఖ్యలతో ఎన్టీఆర్ నందమూరి లెగసీని ముందుకు తీసుకెళ్లడం ఆయనకు ఇష్టం లేదేమో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అటు పొలిటికల్ గా ఇటు సినిమా కెరీర్ పరంగా ఎన్టీఆర్ హైలైట్ అవడం బాలయ్యకు ఇష్టం లేదేమో అని సోషల్ మీడియా వేదికగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.