Begin typing your search above and press return to search.

బాల‌య్య 108 లో త్రిపాత్రాభిన‌య‌మా?

By:  Tupaki Desk   |   24 Dec 2022 12:36 PM GMT
బాల‌య్య 108 లో త్రిపాత్రాభిన‌య‌మా?
X
న‌ట‌సింహ బాల‌కృష్ణ-బోయ‌పాటి కాంబినేష‌న్ అంటే క‌చ్చితంగా బాల‌య్య డ్యూయ‌ల్ రోల్ పోషించాల్సిందే. ఇది ఆ ద్వ‌యం తీసుకున్న బ‌ల‌మైన నిర్ణ‌యం. `సింహ‌`...`లెజెండ్`..`అఖండ` వ‌ర‌కూ ప్ర‌తీ సినిమాలో బాల‌య్య డ‌బుల్ యాక్ష‌న్ తోనే బాక్సాఫీస్ ని షేక్ చేసారు. అంత‌కు ముందు చాలా సినిమాల్లో బాల‌య్య ద్విపాత్రాభిన‌యంతో ప్రేక్ష‌కుల్ని ఎన్నోసార్లు అల‌రించారు.

మ‌రి ఇప్పుడు 108 లో అంత‌కు మించి బాల‌య్య‌ని హైలైట్ చేస్తున్నారా? అంటే అవున‌నే టాక్ వినిపిస్తుంది. ప్ర‌స్తుతం అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య 108వ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో బాల‌య్య ఏక‌గా త్రిపాత్రాభియం చేస్తున్న‌ట్లు స‌మాచారం. అనీల్ మార్క్ ఎంట‌ర్ టైనింగ్ మిస్ అవ్వ‌కుండా బాల‌య్య శైలి యాక్ష‌న్ లెవ‌ల్స్ ఏమాత్రం త‌గ్గ‌కుండా క‌థ‌ని సిద్దంచేసిన‌ట్లు తెలుస్తోంది.

అలా క‌థ‌లో నుంచే మూడు పాత్ర‌లు బాల‌య్య పోషిస్తేనే బాగుంటుంద‌ని భావించి ఆబాధ్య‌తలు ఆయ‌న‌కే అప్ప‌గించారుట‌. రెండు పాత్ర‌లు సీరియ‌స్ గా సాగుతాయుట‌. మ‌రో రోల్ మాత్రం పూర్తిగా ఇన్నోసెంట్ గా..హాస్యాస్ప‌దంగా డిజైన్ చేసారుట‌. రెండు పాత్ర‌లు కామ‌న్ గా క‌నిపించినా...ఓపాత్ర లో మాత్రం పూర్తిగా స‌రికొత్త బాల‌య్య‌నే ఆవిష్క‌రిస్తున్న‌ట్లు గుస గుస‌ వినిపిస్తుంది.

ఇలాంటి పాత్ర‌లో బాల‌య్య‌ని మునుపెన్న‌డు చూసి ఉండ‌ర‌ని..అంత కొత్త‌గా బాల‌య్య తెర‌పైకి కనిపిస్తార‌ని స‌మాచారం. ఆపాత్ర గురించి తెలుసుకునే బాల‌య్య స‌ర్ ప్రైజ్ పీల‌య్యాడుట‌. ఆ పాత్ర‌కి అనిల్ త‌న‌దైన టైమింగ్ డైలాగులు..స‌న్నివేశాలు రాసిన‌ట్లు వినిపిస్తుంది. మ‌రి ఈ ట్రిపుల్ యాక్ష‌న్లో వాస్త‌వాలు తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఈసినిమా సెట్స్ లో ఉంది. హైద‌రాబాద్ లో షూటింగ్ జ‌రుగుతోంది. బాల‌య్య తో పాటు ఇత‌ర తార‌గ‌ణ‌పైం చిత్రీక‌ర‌ణ నిర్వ‌హిస్తున్నారు.

ప్ర‌స్తుతం బాల‌య్య `వీర‌సింహారెడ్డి`తో సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ ముగించుకున్న సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. జ‌న‌వ‌రి 12 భారీ అంచ‌నాల మ‌ధ్య బాల‌య్య కోత మొద‌ల‌వుతుంది. అభిమానులు ఇప్ప‌టి నుంచే థియేట‌ర్ల ముస్తాబు ప్లానింగ్ మొద‌లు పెడుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.