Begin typing your search above and press return to search.

బాల‌య్య బాబు టైమింగ్ .. అదిరిందంతే

By:  Tupaki Desk   |   8 Jan 2022 2:21 PM GMT
బాల‌య్య బాబు టైమింగ్ .. అదిరిందంతే
X
నంద‌మూరి బాల‌కృష్ణ `అఖండ‌` బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ తో మంచి జోష్ మీదున్నారు. ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. ఓ రేంజ్ లో ర‌ఫ్ఫాడించేస్తున్నారు. చాలా రోజుల త‌రువాత బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ల‌భించ‌డంతో రెట్టించిన ఉత్సాహంలో వున్న బాల‌కృష్ణ అదే జోష్ ని `ఆహా` టాక్ షో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకె`లోనూ చూపించి ఆక‌ట్టుకుంటున్నారు. `ఆహా` ఓటీటీ కోసం బాల‌య్య హోస్ట్ అవ‌తారం ఎత్తిన విష‌యం తెలిసిందే. `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకె` పేరుతో స్ట్రీమింగ్ అవుతున్న ఈ టాక్ షో విశేషంగా ఆక‌ట్టుకుంటూ టాప్ లో ట్రెండ్ అవుతోంది.

క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబుతో మొద‌లైన ఈ షో విజ‌య‌వంతంగా ర‌న్న‌వుతోంది. తాజాగా హీరో రానాకు సంబంధించిన ప్రోమోల‌ని రిలీజ్ చేశారు. 8 వ ఎపిసోడ్ గా స్ట్రీమింగ్ అవుతున్న తాజా ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ షోలో రానాని ఇరుకున పెట్టే ప్ర‌శ్న‌ల‌తో బాల‌య్య ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. ఇక పెళ్లి విష‌యం గురించి అయితే బాల‌య్య వేసిన ప్ర‌శ్న‌లకు రానా ఉక్కిరిబిక్కిరి అయిపోడ‌ని తెలుస్తోంది.

బాల‌య్య అడిగిన పెళ్లి ప్ర‌శ్న‌ల‌కు రానా స‌ర‌దాగా స‌మాధానాలు చెప్పారు. అంతే కాకుండా హీరోయిన్ ల‌తో ప్రేమాయ‌ణం సాగించినా.. ఎందుకు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వ‌చ్చిందో స్ప‌ష్టం చేయ‌డం న‌వ్వులు పూయిస్తోంది. రానా చెప్పిన స‌మాధానాల‌కు బాల‌య్య అవాక్క‌య్యేలా ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్ అయితే ప్రైస్ లెస్ అని చెప్పొచ్చు. బాల‌య్య హావ భావాల‌కు షోలో వున్న అభిమానులు గొల్లున న‌వ్వేశారు.

ఇంత‌కీ ప్రోమోలో రానాని బాల‌య్య ఏమ‌ని అడిగారంటే... రానా నువ్వు హీరో అయిన‌ప్ప‌టి నుంచి వింటున్నా రానా ప‌లానా హీరోయిన్ తో ల‌వ్వు... ఫ‌లానా హీరోయిన్ తో ల‌వ్వు అని.. అయితే ఒక‌రోజు రానా పెళ్ల‌న్నారు..హీరోయిన్ ఎవ‌ర‌ని అడిగా.. బ‌య‌ట‌మ్మాయి అన్నారు. ఈ ట్విస్టేంటీ? అని బాల‌య్య అడిగితే.. వ‌ర్క‌వుట్ అవ్వ‌లేదు సార్ అని రానా చెప్ప‌డంతో బాల‌య్య ఒక్క‌సారిగా న‌వ్వేశారు.

ఆ త‌రువాత మ‌ళ్లీ బాల‌య్య .. `మీ బాబాయ్ ఫ్యామిలీ పిక్చ‌ర్ లే క‌దా చేసేది. ఎఫ్ 2, ఎఫ్ 3 అని ఫ్ర‌స్ట్రేటెడ్ మొగుడి వేశాలు వేస్తుంటాడు క‌దా? .. మ‌రి నీ పెళ్లి రోజున ఏదైనా స‌ల‌హా ఇచ్చాడా? .. అని అడిగాడు. దానికి రానా `నేను పెళ్లి చేసుకుంటున్నాన‌ని ఫ‌స్ట్ షాక‌య్యారు స‌ర్ ` అన్నాడు. అమ్మా బాల‌య్య ఇక్క‌డే త‌న టైమింగ్ ని చూపించేశాడు.. రానా ఆ మాట చెప్ప‌గానే `వీడికి పెళ్లేంటి అనా... వీడికి కూడా పెళ్లేంటనా...` అని పంచ్ వేసేశాడు.

అయితే దానికి ..దీనికి మ‌ధ్య‌న వున్న రియాక్ష‌న్ ఇచ్చారాయ‌న అని రానా అన‌డంతో బాల‌య్య‌తో పాటు అక్క‌డున్న వారంతా ఒక్క‌సారిగా న‌వ్వేశారు. జ‌న‌వ‌రి 7 నుంచి రానా ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతోంది.