Begin typing your search above and press return to search.

కొండారెడ్డి బురుజు సాక్షిగా బాల‌య్య బ్లాసింగ్ అప్ డేట్‌!

By:  Tupaki Desk   |   19 Oct 2022 10:01 AM GMT
కొండారెడ్డి బురుజు సాక్షిగా బాల‌య్య బ్లాసింగ్ అప్ డేట్‌!
X
గ‌త కొన్ని రోజ‌లుగా నంద‌మూరి బాల‌కృష్ణ అభిమానులు బ్లాస్టింగ్ అప్ డేట్ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. 'అఖండ‌'తో మ‌ళ్లీ ట్రాక్ లోకి వ‌చ్చేసిన నంద‌మూరి బాల‌కృష్ణ అదే ఊపుతో గోపీచంద్ మ‌లినేని డైరెక్ష‌న్ లో NBK 107 ప్రాజెక్ట్ ని చేస్తున్న విష‌యం తెలిసిందే. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై అత్యంత భారీ స్థాయ‌లో నిర్మిస్తున్నారు. హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంటర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ కోసం హీరో బాల‌కృష్ణ ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవ‌లే విదేశాల్లో ప‌లు కీల‌క ఘ‌ట్టాల‌ని పూర్తి చేసిన చిత్ర బృందం హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ జ‌రుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ని ఈ నెల 21న విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన అధికారికంగా ప్ర‌క‌టించిన చిత్ర బృందం క‌ర్నూలు కొండారెడ్డి బురుజు సాక్షిగా బ్లాస్టింగ్ అప్ డేట్ ని అందించ‌బోతున్నామంటూ ప్ర‌క‌టించ‌డంతో ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

టీజ‌ర్ తో ఇప్ప‌టికే భారీ అంచ‌నాల్ని రేకెత్తిస్తున్న ఈ మూవీలో బాల‌కృష్ణ సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ లో బ్లాక్ ష‌ర్ట్ గల్ల లుంగీతో క‌నిపించిన తీరు అభిమానుల్లో మాస్ యుఫోరియాని క్రియేట్ చేసింవ‌ది. అందుకు ఏ మాత్రం త‌గ్గ‌ని రీతిలో సినిమా మ‌రింత ప‌వ‌ర్ ఫుల్ గా వుండ‌నుంద‌నే సంకేతాల్ని మేక‌ర్స్ అందిస్తున్నారు. అందులో భాగంగానే ఈ మూవీకి ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ ని అక్టోబ‌ర్ 21, శుక్ర‌వారం రాత్రి 8:15 నిమిషాల‌కు కొండారెడ్డి బురుజు సాక్షిగా బ్లాస్టింగ్ అప్ డేట్ తో టైటిల్ ని ప్ర‌క‌టించ‌బోతున్నారు.

టైటిల్ రిలీజ్ కోసం 21న క‌ర్నూలులోని కొండారెడ్డి బురుజు ద‌గ్గ‌ర భారీ ఈవెంట్ ని నిర్వ‌హించి టైటిల్ ని ప్ర‌క‌టించ‌బోతున్నారు. ఇలా ఓ మూవీ టైటిల్ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి కావండంతో అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. కీల‌క పాత్ర‌ల్లో క‌న్న‌డ స్టార్‌ దునియా విజ‌య్, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్‌, మ‌ల‌యాళ న‌టి హ‌నీ రోజ్‌, చంద్రిక ర‌వి, లాల్‌ న‌టిస్తుండ‌గా త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌చారంలో వున్న రెడ్డిగారు, జై బాయ్య‌ల‌ని ప‌క్క‌న పెట్టిన మైత్రీ మూవీ మేక‌ర్స్ 21న ఎలాంటి టైటిల్ ని ప్ర‌క‌టించ‌బోతున్నారో.. ఆ టైటిల్ బాల‌య్య అభిమానుల్ని ఏ మేర‌కు స‌ర్ ప్రైజ్ చేయ‌నుంద‌న్న‌ది తెలియాలంటే ఫ్రైడే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.