Begin typing your search above and press return to search.

బోయపాటి వాళ్లందరికీ సమాధానం చెప్పినట్లేనా...?

By:  Tupaki Desk   |   18 Jun 2020 6:15 AM GMT
బోయపాటి వాళ్లందరికీ సమాధానం చెప్పినట్లేనా...?
X
నందమూరి నటసింహ బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో బాలయ్య అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'సింహా' 'లెజెండ్' సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై బాలయ్యతో పాటు ఆయన అభిమానులు కూడా నమ్మకంతో ఉన్నారు. దీనికి తగ్గట్టే బాలకృష్ణ బర్త్ డే కానుకగా ఫస్ట్‌ రోర్‌ పేరుతో విడుదల చేసిన ఫస్ట్ లుక్‌ టీజర్ విశేష ఆదరణ దక్కించుకుంది. ఇందులో పంచెకట్టులో మీసాన్ని మెలితిప్పుతూ మాస్‌ లుక్‌ లో బాలయ్య అదరగొట్టాడు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర అని సమాచారం. ఇప్పుడు రిలీజైన టీజర్ లో కనిపిస్తుంది మరో పాత్ర అని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఈ మధ్య బోయపాటి బాలయ్య సినిమా కోసం బడ్జెట్ అంచనాలను పెంచేసాడని.. ప్రొడ్యూసర్ రవీందర్ రెడ్డిని బాగా ఇబ్బంది పెడుతున్నాడని.. ఫస్ట్ షెడ్యూల్ రషెస్ కూడా ఆశాజనకంగా లేవని వార్తలు వచ్చాయి. 'వినయ విధేయ రామ' వంటి డిజాస్టర్ ఇచ్చిన తర్వాత కూడా బోయపాటి శ్రీను ఇంకా బడ్జెట్ విషయంలో కేర్ తీసుకోవడం లేదంటూ వార్తలు వచ్చాయి. అయితే బోయపాటి శ్రీను మాత్రం ఒక్క స్మాల్ టీజర్ తో అన్నిటికీ సమాధానం చెప్పాడని బాలయ్య ఫ్యాన్స్ అంటున్నారు. #BB3 టీజర్ ఇప్పటి వరకు 12 మిలియన్స్ వ్యూస్ సొంతం చేసుకొని ట్రెండింగ్ లో కొనసాగుతోంది. అంతేకాకుండా ఈ టీజర్ నందమూరి అభిమానులనే కాకుండా కామన్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంది. అందులోనూ వీడియో చూస్తుంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. దీంతో బోయపాటి సినిమాకి తగ్గట్టే బడ్జెట్ అడిగుంటాడని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు. అంతేకాకుండా బోయపాటి వన్ వీక్ షెడ్యూల్ లోనే ఈ రేంజ్ లో భీబత్సం సృష్టిస్తే ఇక సినిమా మొత్తం ఎలా ఉండబోతుందో అని బాలయ్య - బోయపాటి అభిమానులు ఎక్సపెక్టేషన్స్ పెంచేసుకుంటున్నారు. ఈ మధ్య ప్లాపుల్లో ఉన్న బాలయ్య - బోయపాటి శ్రీను ఇద్దరూ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి ఎక్కుతారేమో అని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.