Begin typing your search above and press return to search.
అనిల్ సినిమాలో బాలయ్య క్యారెక్ట్ ఇదేనా?
By: Tupaki Desk | 10 Jun 2022 7:46 AM GMTబోయపాటి శ్రీను డైరెక్షన్‌లో నందమూరి బాలకృష్ణ నటించిన హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'అఖండ'. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం పేరుకు తగ్గట్టే అఖండ విజయాన్ని సాధించి బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. గత కొంత కాలంగా సరైన హిట్ కోసం ఎదరుచూసిన బాలయ్యకు బంపర్ హిట్ ని అందించిన మళ్లీ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. దీంతో రెట్టించిన ఉత్సాహంలో వున్న నందమూరి నటసింహం ప్రస్తుతం తన 107వ మూవీని చేస్తున్నారు.
మైత్రీమూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా 'క్రాక్' మూవీతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసిన ఈ యువ దర్శకుడు బాలయ్య మూవీని హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరపైకి తీసుకొస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. దునియా విజయ్ పవర్‌ఫుల్ విలన్ గా, మలయాళ నటుడు, దర్శకుడు లాల్ .. బాలయ్యకు సహాయకుడిగా నటిస్తుండగా కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించబోతోంది.
శుక్రవారం నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టీజర్ ని ఫస్ట్ హంట్ పేరుతో రిలీజ్ చేశారు. 'భయం నా బయోడేటాలోనే లేదురా..' అంటూ బాలయ్యచెబుతున్న డైలాగ్ లు రోమాంచితంగా వున్నాయి. నెరిసిన గడ్డం.. కొత్త హెయిర్ స్టైల్.. భిన్నమైన ఆహార్యం.. పవర్ ఫుల్ సంభాషణలు.. హైవోల్టేజ్ పోరాట ఘట్టాలు సినిమాపై అంచనాల్ని పెంచేస్తున్నాయి. టీజర్ లో చూపించిన సీన్ లని చూస్తుంటే 'పులిచర్ల' నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్ టైనర్ గా కనిపిస్తోంది.
ఇదిలా వుంటే ఈ మూవీ తరువాత కూడా బాలయ్య ఇదే తరహాలో హై వోల్టేజ్ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు. 108 వ ప్రాజెక్ట్ గా పట్టాలెక్కనున్న ఈ మూవీని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరపైకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలోనూ నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల వయసున్న వ్యక్తిగా నెరిసిన మీసం, గడ్డంతో సరికొత్త లుక్ లో కనిపించనున్నారట. సినిమాలో ఆయన పాత్ర కూడా పవర్ ఫుల్ గా వుంటుందని తెలిసింది.
సినిమాలో బాలకృష్ణ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సీఐ పాత్రలో కనిపించబోతున్నారని, ఆయన పాత్రని అనిల్ రావిపూడి తీర్చి దిద్దిన తీరు ఆశ్చర్యాన్ని కలిగించడం ఖాయమని చెబుతున్నారు.
కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిని అనిల్ రావిపూడి తొలి సారి తన పంథాకు పూర్తి భిన్నంగా పవర్ ఫుల్ మాస్ మసాలా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా బాలయ్య సినిమాని చేయబోతున్నారని తెలుస్తోంది. ఇందులో ఆయనకు కూతురిగా 'పెళ్లిసందD' ఫేమ్ శ్రీలీలా కనిపించనుందని ఇప్పటికే ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. మరిన్ని వివరాలు త్వరలోనే దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించనున్నారు.