Begin typing your search above and press return to search.
గౌతమ్ పై బాలయ్య వ్యాఖ్యలే మహేష్ నవ్వుకు కారణం!
By: Tupaki Desk | 19 Nov 2022 6:35 AM GMTసూపర్ స్టార్ కృష్ణ మృతితో ఆయన కుటుంబ సభ్యులు అంతా దుఃఖంలో ఉన్నారు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే మహేష్ బాబు విషాద వదనం లో కనిపించారు. మహేష్ ను అలా చూసిన అభిమానుల కడుపు తరుక్కు పోయి కన్నీళ్లు పెట్టుకున్నారు. మహేష్ బాబుకు ఏంటీ ఈ కష్టాలు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకు ముందు రోజంతా.. అప్పటి వరకు విషాదం లో ఉన్న మహేష్ బాబు ఎప్పుడైతే బాలకృష్ణ అక్కడకు వచ్చాడో అప్పుడు నవ్వారు. కృష్ణ కు నివాళులు అర్పించిన బాలకృష్ణ ఆ తర్వాత కొద్ది సమయం మహేష్ బాబుతో మాట ముచ్చట పెట్టారు. ఆ సమయంలోనే అక్కడ గౌతమ్ కృష్ణ మరియు గల్లా జయదేవ్ కూడా ఉన్నారు.
మహేష్ బాబు తో బాలకృష్ణ మాట్లాడుతూ ఉన్న సమయంలో పక్కనే ఉన్న గౌతమ్ కృష్ణ ని చూసి.. మీ వాడు పెద్దోడు అయ్యాడు, హీరోగా పరిచయం చేయవచ్చు అన్నట్లుగా ఉన్నాడు. అప్పుడు గౌతమ్ తో పాటు మహేష్ బాబు కూడా మురిసిపోతూ నవ్వడం చూడవచ్చు.
దుఃఖంలో ఉన్న మహేష్ బాబుకు తన కొడుకు గురించి మాట్లాడిన సమయంలో నవ్వు వచ్చిందని.. ఆ సమయం లోనే సంతోషంగా కూడా మహేష్ బాబు కనిపించారని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా అయితే అలాంటి చోట జోకులు వేయడం.. నవ్వించడం వంటివి చేస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కానీ బాలయ్య పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు.
నిన్నటి నుండి దుఃఖంలో ఉన్న మా బాబును నవ్వించిన బాలయ్య కు కృతజ్ఞతలు అంటూ కొందరు మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో స్పందించారు. ఎప్పటిలాగే కొందరు మాత్రం బాలయ్య కు ఎక్కడ ఎలా ఉండాలో తెలియదా అని విమర్శించారు. మొత్తానికి ఆ నవ్వులు అయితే ఆ రోజు తర్వాత రోజు కూడా వైరల్ అయ్యాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.