Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీపై మరోసారి ప్రేమను చాటుకున్న బాలయ్య...!
By: Tupaki Desk | 26 July 2020 7:50 AM GMTదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారి నుంచి ప్రజలు తమని తాము కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చాలామంది సెలబ్రిటీలు, స్టార్లు సామాజిక భాద్యతగా వీడియోలు ద్వారా.. ట్వీట్స్ ద్వారా తమ అభిమానులకు జాగ్రత్తలు చెప్తున్నారు. ఈ క్రమంలో వ్యాధినిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోవాలని.. వ్యాయమం చేయాలని కొంత మంది చెప్పగా.. మాస్క్ పెట్టుకోవాలని.. సామాజిక దూరం పాటించాలని.. చేతులు కడుక్కోవాలని సెలబ్రెటీలందరూ సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరో నందమూరి బాలకృష్ణ కరోనా వైరస్ సోకకుండా కాపాడే వ్యాధినిరోధక శక్తి పెంచే మెడిసిన్ అందజేస్తున్నారు. బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ తరపు నుంచి కరోనా బారిన పడకుండా ముందు జాగ్రత్తగా హోమియో పిల్స్, విటమిన్ టాబ్లెట్స్ సినీ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ లోని అందరు సాంకేతిక నిపుణులకు బాలకృష్ణ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది.
కాగా దీనికి సంబంధించి బాలయ్య ఎలాంటి పబ్లిసిటీ చేసుకొనప్పటికి ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ద్వారా ఈ విషయం బయటకి వచ్చింది. వీవీ వినాయక్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ "ముందు జాగ్రత్తగా కరోనా నిరోధానికి హోమియో పిల్స్ మరియు విటమిన్ టాబ్లెట్స్ ను బసవతారకం హాస్పిటల్ ద్వారా బాలకృష్ణ గారు పంపారు. నాకే కాదు ఈ మెడిసిన్ ను ఆయన 24 క్రాఫ్ట్స్ కు చెందిన అందరికీ పంపిస్తున్నారు. నన్ను గుర్తుపెట్టుకుని మరీ పంపినందుకు బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు" అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి వేదికగా ఎంతోమంది పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న బాలయ్య.. కరోనా నుంచి రక్షణ పొందేందుకు చర్యలు చేపట్టి మరోసారి మంచి మనసు చాటుకున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాలయ్య చేస్తున్న మంచి పనికి ఇండస్ట్రీ జనాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.