Begin typing your search above and press return to search.
బాలయ్య అభిమానుల్లో అంత కలవరం ఎందుకో..?
By: Tupaki Desk | 27 May 2022 8:30 AM GMTనటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానుల్లో కొత్త కలవరం మొదలైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత కొంత కాలం నుంచీ వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న బాలయ్య.. ఎట్టకేలకు `అఖండ`తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుని మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఇదే జోరును కొనసాగించాలని భావిస్తున్న బాలయ్య తన తదుపరి చిత్రాన్ని `క్రాక్`తో సూపర్ ఫామ్ లోకి వచ్చిన గోపీచంద్ మలినేనితో ప్రకటించారు.
`ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్ తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా చేస్తున్నారు. శరవేగంగా షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది పూర్తైన వెంటనే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన అనిల్ రావిపూడితో ఓ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు బాలయ్య. ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. తండ్రీకూతుళ్ల మధ్య సాగే ఎమోషనల్ కథ ఇదని.. ఇందులో బాలయ్య 45ఏళ్లు వయసు గల తండ్రి పాత్రలో నటిస్తే, ఆయన కూతురిగా యంగ్ బ్యూటీ శ్రీలీల మెరవబోతోందని ఇటీవల అనిల్ రావిపూడి స్పష్టం చేశారు.
ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా నేషనల్ అవార్డు గ్రహీత ప్రియమణి ఎంపిక అయిందని, ఆమె బాలయ్యకు భార్యగా కనిపించబోతోందని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చి నెట్టింట వైరల్ మారింది. అయితే ఇప్పుడీ ప్రచారమే బాలయ్య అభిమానులను కలవర పెడుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. గతంలో బాలయ్య, ప్రియమణి జంటగా నటించిన `మిత్రుడు` చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది.
మహదేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులనే కాదు నందమూరి అభిమానులను సైతం ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత మళ్లీ బాలయ్య, ప్రియమణిలు జత కట్టలేదు. పైగా ప్రస్తుతం కెరీర్ పరంగా సక్సెస్ రేట్ తక్కువగా ఉన్న హీరోయిన్ల జాబితాలో ప్రియమణి కూడా ఒకరు. అందుకే ప్రియమణి పేరు తెరపైకి రాగానే సినిమా ఎక్కడ తేడా కొడుతుందో అని నందమూరి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నట్లు టాక్ నడుస్తోంది.