Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌పై బాలయ్య అభిమానుల దాడి

By:  Tupaki Desk   |   20 Jan 2019 3:57 PM IST
ఎన్టీఆర్‌పై బాలయ్య అభిమానుల దాడి
X
దాడి అనగానే ఫిజికల్‌ గా అనుకోకండి. ఎమోషనల్‌ దాడి. అంటే.. సోషల్‌ మీడియా ద్వారా ఎన్టీఆర్‌ ని ట్రోల్ చేస్తున్నారు బాలయ్య అభిమానులు. దీనికి కారణం ఏంటంటే.. ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీశారు బాలయ్య. సినిమా రిజల్ట్‌ ఎలా ఉన్నా.. మంచి ప్రయత్నం అని అందరూ ముక్తకంఠ తో ఒప్పుకున్నారు. కానీ ఇంతవరకూ ఎన్టీఆర్‌ మాత్రం.. బయోపిక్‌ గురించి కానీ, బాలయ్య గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇదే బాలయ్య అభిమానుల ఆగ్రహానికి కారణమైంది.

రీసెంట్‌ గా ఎన్టీఆర్‌ 23వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ఘాట్‌కు అన్నయ్య కల్యాణ్‌ రామ్‌ తో కలిసి వెళ్లాడు తారక్‌. అక్కడ విషాద వదనంతో కూర్చున్నాడు. ఆ ఫోటోల్ని చూసిన బాలయ్య అభిమానులు.. తాత నటించిన సినిమా గురించి పట్టించుకోవు, ప్రమోట్‌ చేయవు కానీ తాత సమాధి దగ్గరకు మాత్రం వచ్చి నాటకాలు ఆడతావు అంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

హరికృష్ణ మరణం తర్వాత బాలయ్య-ఎన్టీఆర్‌ మధ్య సన్నిహిత సంబంధాలు పెరిగాయి. ఈ చనువుతోనే.. కథానాయకుడా ఆడియో ఫంక్షన్‌ ని తారక్‌ వచ్చాడు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ.. కథానాయకుడు గురించి ఇంతవరకు తారక్‌ ఎక్కడా మాట్లాడలేదు, ట్విట్టర్‌ లో రెస్పాన్స్‌ కూడా చెప్పలేదు. దీంతో.. బాలయ్య, తారక్‌ మధ్య ఏదో జరిగిందనే గుసగుసలు మాత్రం బాగా విన్పిస్తున్నాయి.