Begin typing your search above and press return to search.

రవితేజను కలవడం ఎందుకు ఇకపై నన్ను కలువు

By:  Tupaki Desk   |   3 Jan 2022 8:30 AM GMT
రవితేజను కలవడం ఎందుకు ఇకపై నన్ను కలువు
X
ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్న బాలకృష్ణ అన్‌ స్టాపబుల్‌ షో గురించి ఈమద్య ప్రతి రోజు సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. ప్రతి వారం ఎవరో ఒక గెస్ట్‌ తో బాలయ్య చిట్‌ చాట్‌ చేయడం.. ఆ వారం అంతా కూడా ఆ చిట్ చాట్ గురించిన చర్చ అభిమానుల్లో మరియు సోషల్ మీడియాలో జరగడం చూస్తూనే ఉన్నాం. మొన్న శుక్రవారం రవితేజ మరియు గోపీచంద్‌ మలినేని కలిసి బాలయ్య అన్‌ స్టాపబుల్‌ షో లో సందడి చేశారు. మొన్నటి వరకు బాలయ్య మరియు రవితేజల మద్య కోల్డ్ వార్‌ ఉందని అంతా అనుకున్నారు. కాని తాజాగా షో లో పాల్గొన్న వారిద్దరు స్వయంగా మా మద్య గొడవలు లేవు అంటూ నిరూపించారు. మా మద్య గొడవలు ఉన్నాయి అనుకునే వాళ్లు తెలివి తక్కువ వాళ్లు అన్నట్లుగా కామెంట్స్ చేశారు. ఇక ఇదే సమయంలో దర్శకుడు గోపీచంద్‌ మలినేనితో బాలకృష్ణ చాలా సరదాగా సంభాషణలు సాగించాడు.

ప్రస్తుతం బాలయ్య తో గోపీచంద్‌ మలినేని సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా కనుక సరిగా రాకుంటే దబిడి దిబిడే అన్నట్లుగా బాలయ్య ఫన్నీ కామెంట్స్ చేస్తూ సరదాగా గోపీచంద్‌ ను హెచ్చరించడం మొదలుకుని రవితేజను ఎందుకు కలవడం నన్ను రెగ్యులర్ గా కలువు మనం మంచి సినిమా చేద్దాం అన్నట్లుగా బాలయ్య అన్నాడు. గోపీచంద్‌ మాట్లాడుతూ సినిమా చేసినా చేయకున్నా కూడా రెగ్యులర్‌ గా రవితేజ తో తాను కలుస్తాను అన్నాడు. ఈ షో కు రావడానికి రెండు రోజుల ముందు కూడా మేము ఇద్దరం కలిశాం. అనేక విషయాల గురించి మేము ఇద్దరం మాట్లాడుకుంటాం అన్నాడు. అప్పుడు బాలయ్య కల్పించుకుని రాబోయే ఆరు నెలల వరకు రవితేజను కలవకు నీ రాబోయే సినిమా హీరోతో కలువు అన్నట్లుగా బాలయ్య సరదాగా సూచించాడు.

మన ఇద్దరి కాంబినేషన్‌ లో బ్లాక్ బస్టర్ వచ్చే వరకు రవితేజను కలువకుండా రెగ్యులర్ గా నన్ను కలువు అన్నట్లుగా బాలయ్య మాట్లాడారు. సరదాగా ఈ ముగ్గురి మద్య సాగిన సంభాషణలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రవితేజ మరియు బాలయ్య ల టాక్ షో ను ఏ ఒక్కరు ఊహించలేదు. ఊహించని కాంబోతో బాలయ్య అన్‌ స్టాపబుల్‌ సాగుతోంది. ఈ వారం రానా స్పెషల్‌ గెస్ట్ గా వచ్చాడు. ఇద్దరు కూడా మరింత జోవియల్‌ గా.. సరదాగా.. చిల్లర ముచ్చట్లు పెట్టి ప్రేక్షకులను నవ్వించబోతున్నట్లుగా ప్రోమో చూస్తుంటే అర్థం అవుతుంది. ఇక రానా ఎపిసోడ్‌ తర్వాత మహేష్‌ బాబుతో ఇప్పటికే షూట్‌ చేసిన ఎపిసోడ్‌ ను స్ట్రీమింగ్‌ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.