Begin typing your search above and press return to search.

పీకే పాత్ర‌లో బాల‌య్య అయితే ద‌బిడి దిబిడే!

By:  Tupaki Desk   |   17 Oct 2022 5:37 AM GMT
పీకే పాత్ర‌లో బాల‌య్య అయితే ద‌బిడి దిబిడే!
X
మాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'అయ్య‌ప్పునం కోషియ‌మ్' తెలుగులో 'భీమ్లా నాయ‌క్' గా ఇక్క‌డా బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. మాతృక‌లో పృధ్వీరాజ్ సుకుమారన్ పాత్ర‌ని రానా (డేనియ‌ల్ శేఖ‌ర్) పోషించ‌గా... బిజుమీన‌న్ పోలీస్ పాత్ర‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ (నాయ‌క్) పాత్ర‌తోనూ మెప్పించారు. అయితే నాయ‌క్ పాత్ర ఎంపిక స‌మ‌యంలో కొంత స్త‌బ్ద‌త నెల‌కొంది.

ప్రాజెక్ట్ బ్యాకెండ్ ఉన్న‌ త్రివిక్ర‌మ్-సాగ‌ర్ చంద్ర‌ ప‌వ‌న్ సరిపోతాడా? లేదా? అన్న త‌లెత్తిన నేప‌థ్యంలో న‌ట‌సింహ బాల‌కృష్ణ‌...మాస్ రాజా ర‌వితేజ పేర్లు సైతం తెర‌పైకి వ‌చ్చాయి. ప‌వ‌న్ గాకుండా వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రైతే ఆ మాస్ పోలీస్ పాత్ర‌కి పక్కాగా యాప్ట్ అవుతార‌ని ప్ర‌చారం సాగింది. కానీ చివ‌రిగా ప‌వ‌న్ కే ఆ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఆ పాత్ర‌లో ప‌వ‌న్ కాకుండా బాల‌య్య మెరిసి ఉంటే ఎలా ఉండేది? అన్న‌ది ఆల‌స్యంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీస్తోంది.

అందుకు కారణం ఆ చిత్ర నిర్మాత సూర్య దేవ‌ర నాగ‌వంశీనే. అన్ స్టాప‌బుల్ షో వేదిక‌గా ఈ విష‌యం తెలుస్తోంది. భీమ్లా నాయ‌క్ కి ముందుగా? ఏ హీరోని అనుకున్నారని ప్రశ్న‌ రాగా.. బాల‌య్య‌నే ఆ పాత్ర‌కి ముందుగా అనుకున్నార‌న్న విష‌యం ప్రోమో హింట్ ఇస్తోంది. మ‌రి నిజంగా బాల‌య్య‌ని అనుకున్నారా? పీకే ని అనుకున్నారా? అన్న‌ది ఎపిసోడ్ ప్ర‌సారం అయితే గానీ క్లారిటీ రాదు.

కానీ ఈ వార్త సంచ‌ల‌న‌మే. ముందుగా బాల‌య్య‌ని హీరోగా అనుకుంటే పీకే అప్పుడు సెకెండ్ ఛాయిస్ గా సినిమాలోకి తీసుకున్నార‌ని భావించాలి. బాల‌య్య కాదంటేనే ఆ అవ‌కాశం ప‌వ‌న్ కి ద‌క్కిన‌ట్లుగా నంద‌మూరి అభిమానులు భావిస్తున్నారు. అదే పాత్ర‌లో బాల‌య్య న‌టించి ఉంటే? సినిమా మ‌రోలా ఉండేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

బాల‌య్య లో ఫైరింగ్ యాంగిల్ కి అలాంటి పాత్ర ప‌డితే విశ్వ‌రూపం చూపిస్తార‌ని.. జ‌స్ట్ మిస్ అంటూ సింహం గ‌త సినిమాల క్యారెక్ట‌రైజేష‌న్ ని గుర్తు చేస్తున్నారు. నిజ‌మే బాల‌య్య సోలోగా త‌ల‌ప‌డితే ప్ర‌త్య‌ర్ధికి ఊపిరాడ‌దు. డైలాగ్ చెప్పాల‌న్నా...యాక్ష‌న్ సీన్ చేయాల‌న్న బాల‌య్య కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన్ డిక్ష‌న్ ఉంది. దాన్ని మ్యాచ్ చేయ‌డం టాలీవుడ్ లో ఏ హీరో వ‌ల్ల కాదు. 60 దాటినా బాల‌య్య తెర‌పై మెరుపులు క‌నిస్తున్నాయంటే? కారణం ఆయ‌న లెగ‌స్సీనే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.