Begin typing your search above and press return to search.

ట‌ర్కీలో బాల‌య్య..సామాన్యుడితో స‌ర‌దాగా ఇలా!

By:  Tupaki Desk   |   31 Aug 2022 1:44 PM GMT
ట‌ర్కీలో బాల‌య్య..సామాన్యుడితో  స‌ర‌దాగా ఇలా!
X
న‌ట‌సింహ బాల‌య్య రీల్ లైఫ్ క్యారెక్ట‌ర్ కి..రియ‌ల్ లైఫ్ క్యారెక్ట‌ర్ కి పెద్ద తేడా ఉండ‌దు. బాల‌య్య కోపిస్ట్ అయినా మ‌న‌సు వెన్న. బాల‌య్య‌లో ఆ యాంగిల్ ని బేస్ చేసుకునే బోయ‌పాటి సినిమాలు చేస్తుంటాడు. న‌ట‌సింహంతో ప‌నిచేసిన ఏ ద‌ర్శ‌కుడు అయినా ఆయ‌న‌కు బాగా క్లోజ్ అయిపోతుంటారు. ఆయ‌న వ్య‌క్తిత్వం..మంచి మ‌న‌సు గురించి ప్ర‌త్యేకంగా చెబుతుంటారు.

పూరి జ‌గ‌న్నాధ్ బాల‌య్య మ‌ధ్య క్లోజ్ నెస్ పెర‌గ‌డానికి కార‌ణం కూడా అదే. నిజ‌యితీగ‌ల మ‌నిషి..ఏ విష‌య‌మైనా ముఖం మీదే చెప్పేస్తారు. దాప‌రికాలుండ‌వు..రాజ‌కీయాలు అంత‌క‌న్నా ఉండ‌వు అంటుంటారు. తాజాగా ఓ సామాన్యుడితోనూ బాల‌య్య అంతే చ‌నువుగా మెలుగుతారు అని ఓ వీడియో ద్వారా అర్ధ‌మ‌వుతుంది.

ప్ర‌స్తుతం బాల‌య్య క‌థానాయ‌కుడిగా 107వ సినిమా షూటింగ్ ట‌ర్కీలో జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా బాల‌య్య ట‌ర్కీలోని ఓ రెస్టారెంట్ కి వెళ్లారు. అక్క‌డ ఓ కుటుంబంతో క‌లిసి టిఫిన్ చేసారు. వారితో కాసేపు స‌ర‌దాగా క‌బుర్లు చెప్పారు. "హేభాయ్ టిఫిన్ చేసేసా. ఇక మందులు వేసుకునే స‌మ‌యం అయింది. ఓ వైపు హిందుపురం ఎమ్మెల్యేగా.. మ‌రోవైపు బ‌స‌వ‌తార‌కం ఆసుప‌త్రి చైర్మెన్ గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నా.

ఇలా ఇన్ని ప‌నులు చేయ‌డం వ‌ల్ల ఆనందంగా ఉంది. ఏ ప‌నిచేయ‌కుండా ఖాళీగా కూర్చునే వాళ్ల‌కి పిచ్చి ఆలోచ‌న‌లు వచ్చేస్తాయన్నారు". అనంత‌రం ఓ మ‌హిళ‌ను చూపించి.... "వీళ్లు ఇంట్లో కూర్చుని సీరియ‌ళ్లు చూస్తుంటారు. మైండ్ పాడు చేసుకుంటారు. నా ఉద్దేశం ప్రకారం టీవీ త‌క్కువ చూస్తే క‌ళ్ల‌కు మంచిది. అస‌లు చూడ‌క‌పోతే మెద‌డుకి మంచింది అని చెప్పుకొచ్చారు.

బాల‌య్య మాట‌ల‌తో ఆ కుటుబం న‌వ్వుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది. బాల‌య్య అభిమానులు అత‌ని సింప్లిసిటీని చూసి తెగ ముచ్చ‌ప‌డుతున్నారు. ఇదే బాల‌య్య అంటే...జై బాల‌య్య‌..జై జై బాల‌య్య అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. బాల‌య్య న‌టిస్తోన్న తాజా చిత్రానికి గోపీ చంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే బాల‌య్య 108వ చిత్రాన్ని సె ట్స్ పైకి తీసుకెళ్ల‌నున్నారు. దీనికి అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.