Begin typing your search above and press return to search.
బాలయ్య ఇమేజ్ నే కాదు.. రెమ్యునరేషన్ ను పెంచేసిన ‘అఖండ’
By: Tupaki Desk | 9 Jan 2022 4:42 AM GMTఎవరేమన్నా బాలయ్య సినిమాలకు ఒక గుణం ఉంటుంది. అప్పటివరకు ఉన్న ట్రెండ్ ను బ్రేక్ చేసేలా విజయాన్ని సాధించటం ఆయనకు మాత్రమే సాధ్యం. బాలయ్య సినిమాలకు మార్కెట్ ఉందా? అన్న సందేహం వచ్చిన ప్రతిసారీ ఆయనకో భారీ ఘన విజయం ఆయన ఖాతాలో పడటం కనిపిస్తుంది. ఆయన కెరీర్ ను చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఒక లారీ డ్రైవర్ కావొచ్చు.. మరో సమరసింహారెడ్డి కావొచ్చు.. ఇంకో సింహ కావొచ్చు.. తాజా అఖండ కావొచ్చు. బాలయ్య కెరీన్ స్పాన్ ను మరో లెవల్ కు తీసుకెళ్లటం కనిపిస్తుంది.
ఇవాల్టి రోజున ఎంత మొనగాడి సినిమా అయినా సరే.. మహాఅయితే రెండువారాలు.. మూడో వారం కష్టంగా.. నాలుగో వారం మరింత ఇబ్బందికరంగా థియేటర్ లో నడిపే పరిస్థితి. అలాంటిది.. సినిమా విడుదలైన ఇన్ని రోజులకు కూడా.. అఖండ ఇంకా కొన్ని థియేటర్లలో రన్ కావటం చూస్తే.. అదంతా బాలయ్యకు మాత్రమే సాధ్యమని చెప్పాలి. అఖండ మూవీతో అనూహ్య రీతిలో బాక్సాఫీస్ ను బ్రేక్ డ్యాన్స్ చేసిన ఆయన.. ఇప్పుడా విజయానందాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. తాను ఇంతవరకు చేయని ప్రయోగాన్ని ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద చేస్తున్న ''అన్ స్టాపబుల్ విత్ ఎన్ బీకే షో'కు వ్యాఖ్యాతగా చేస్తున్న వైనానికి వస్తున్న సానుకూల స్పందన ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. ఈ టాక్ షోకు బాలయ్య ఒక్కో ఎపిసోడ్ కు రూ.40 లక్షలు పారితోషికం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. మొత్తం 12 వారాలకు రూ.5 నుంచి రూ.6కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లుగా సమాచారం.
ఓవైపు ఓటీటీలో అదరగొట్టేస్తూ.. మరోవైపు వెండి తెర మీద వెలిగిపోతున్న బాలయ్య ఇప్పుడు మాంచి స్పీడ్ మీద ఉన్నారు. తాజాగా ఆయన సాధించిన అఖండ విజయంతో ఆయన రెమ్యునరేషన్ లో మార్పు వచ్చేసిందని చెబుతున్నారు. అఖండకు రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా చెబుతారు. ఈ మూవీ సాధించిన ఘన విజయం తర్వాత ఆయన చేస్తున్న తాజా మూవీ గోపీచంద్ మలినేనితో అన్న విషయం తెలిసిందే. ఈ మూవీకి రూ.15-20 కోట్ల మధ్య పారితోషికాన్ని ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఈ మూవీతో పాటు.. మరో మూడు సినిమాలకు బాలయ్య ఓకే చెబుతున్నారని.. అఖండ స్పీడ్ ను అందిపుచ్చుకొని చకచకా సినిమాలు చేయాలని భావిస్తున్నారు. బాలయ్యకున్న క్రేజ్ ను సొమ్ము చేసుకోవటానికి నిర్మాతలు సైతం ఆసక్తిని చూపిస్తుండటంతో.. రానున్న రోజుల్లో ఆయన సినిమాలు వరుస పెట్టి వస్తాయని చెప్పక తప్పదు.