Begin typing your search above and press return to search.
సంక్రాంతికి పవన్ స్టామినా చూపించబోతున్న బాలయ్య..!
By: Tupaki Desk | 3 Jan 2023 12:30 AM GMTనందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 యొక్క పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కోసం మెగా మరియు నందమూరి అభిమానులు ఇంకా ఇతర సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పవన్ కళ్యాణ్ యొక్క అన్ స్టాపబుల్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తి అయిన విషయం తెల్సిందే.
ఒకటి రెండు రోజుల్లోనే ప్రోమో ను వదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల ప్రభాస్ ఎపిసోడ్ తో అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న ఆహా వారు అంతకు మించి అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో రెస్పాన్స్ ను దక్కించుకోవాలని.. వేల సంఖ్యలో కొత్త ఖాతాదారులను సొంతం చేసుకోవాలని భావిస్తున్నారట.
ఒక మంచి సమయం చూసి ఆహా లో పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేసే విధంగా ప్లాన్ చేశారు.
ఆ మంచి సమయం సంక్రాంతి కంటే మరోటి ఉండదు అనే ఉద్దేశ్యంతో బాలయ్య అన్ స్టాపబుల్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ను ఈనెల 13వ తారీకున స్ట్రీమింగ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్ 2 స్ట్రీమింగ్ ఈ వారం పూర్తి అవుతుంది. ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ పూర్తి అయిన వెంటనే పవన్ కళ్యాణ్ యొక్క ఎపిసోడ్ కు సంబంధించిన స్ట్రీమింగ్ తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆహా వర్గాల నుండి సమాచారం అందుతోంది.
అన్ స్టాపబుల్ లో బాలయ్య మరియు పవన్ కళ్యాణ్ మధ్య ప్రస్థావనకు వచ్చిన అంశాలు ఏంటీ అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాలు మొదలుకుని రాజకీయాలు.. వ్యక్తిగత విషయాలు.. అభిమానులు ఇలా అన్ని విషయాల గురించి అన్ స్టాపబుల్ లో పవన్ నుండి బాలయ్య సమాధానాలు రాబట్టినట్లుగా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.