Begin typing your search above and press return to search.
తమిళనాడులో అఖండ గర్జనకు బాలయ్య రెడీ
By: Tupaki Desk | 27 Jan 2022 6:30 AM GMTనందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన చిత్రం `అఖండ`. బోయపాటి శ్రీను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 2న విడుదలై అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. విపత్కర సరిస్థితుల్లోనూ అనూహ్య విజయాన్ని సాధించి టాలీవుడ్ మేకర్ లకి సరికొత్త ఉత్సాహాన్ని, జోష్ ని అందించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. బాలయ్య కెరీర్‌లోనే అత్యంత భారీ వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచి సరికొత్త రికార్డుని నెలకొల్పింది. బాలయ్య తొలిసారి అఘోరా పాత్రలో నటించిన తీరు, ప్రీ క్లైమాక్స్ సన్ని వేశాల్లో శితాండవం చేస్తూ ఉగ్రరూపం దాల్చినట్టుగా బాలయ్యని చూపించిన తీరు ప్రేక్షకులతో పాటు ఆయన అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది.
కొంత విరామం తరువాత బాలయ్యకు తిరుగులేని విజయాన్ని అందించిన ఈ చిత్రం ఇప్పడు దేశ వ్యాప్తంగా హిందుత్వ కారణంగా హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ ఇందులో ద్విపాత్రాభినయం చేసిన విషయం తెలిసిందే. అఖండ రుద్ర సికిందర్ అఘోరా, మురళీ కృష్ణ పాత్రల్లో నటించారు. ఇందులో అఖండ పాత్ర ప్రధాన హైలైట్ గా నిలిచింది. దీంతో ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కాగా ఉత్తరాదిలోనూ ఈ చిత్రానికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఇటీవలే జనవరి 21న ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేశారు.
రికార్డు స్థాయిలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఆకట్టుకుంటున్న ఈ చిత్రానికి ఇతర బాషల్లోనూ డిమాండ్ పెరగడంతో తమిళంలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. జనవరి 28న శుక్రవారం `అఖండ` తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సైలెంట్ గా డబ్బింగ్ కార్యక్నమాలు పూర్తి చేసి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. భారీ స్థాయిలో ఈ మూవీ తమిళ వెర్షన్ థియేటర్లలో సందడి చేయబోతోంది.
ప్రస్తుతం తమిళంలో రిలీజ్ కి ఏ సినిమాలు లేకపోవడం కూడా ఈ చిత్రానికి బాగా కలిసి వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన తమిళనాడు థియేటర్ వర్గాలు `అఖండ` తమిళ వెర్షన్ కోసం భారీ స్థాయిలో థియేటర్లని కేటాయించారట. దీంతో అక్కడ బాలయ్య గర్జనకు అంతా రెడీ అయిపోయిందని అంటున్నారు. తెలుగులో సంచలనాలు సృష్టించిన `అఖండ` తమిళంలోనూ అదే రాంపేజ్ ని కంటిన్యూ చేయడం గ్యారెంటీ అని తెలుస్తోంది. పైగా హిందూత్వ పై ప్రధానంగా సాగిన కథ, కథనాలు ఈ సినిమాని ప్రతీ భాషలోనూ బ్లాక్ బస్టర్ గా నిలపడం కాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ దిగ్గజం `అఖండ`ని అన్ని బాషల్లోనూ విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగిఏ పాన్ ఇండియా స్థాయిలో బాలయ్య `అఖండ` విశ్వరూపం చూపించడం ఖాయం అంటున్నారు. బోమపాటి శ్రీను - బాలకృష్ణల కలయికలో వచ్చిన మూడవ చిత్ర మిది. గతంలో సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ల తరువాత వచ్చిన `అఖండ` కూడా ఆ చిత్రాలకు మించి బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు బాలయ్య - బోయపాటి కాంబో హ్యాట్రిక్ కాంబోగా మారిపోయింది.