Begin typing your search above and press return to search.
షాకింగ్ లుక్ లో బాలయ్య.. 'BB3'లో అఘోరా పాత్ర గెటప్ ఇదేనా..?
By: Tupaki Desk | 30 March 2021 8:08 AM GMTనందమూరి బాలకృష్ణ హీరోగా డైరెక్టర్ బోయపాటి శ్రీను ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో బాలయ్య డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన 'BB3' టీజర్ లో బాలయ్య పంచె కట్టులో మీసం మెలేస్తూ అదరగొట్టాడు. అయితే ఆయన ఈ చిత్రంలో అఘోరా పాత్రలో కూడా కనిపిస్తారని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది. అఘోరా అంటే జడలు పెరిగిన జుట్టుతో ఒంటి నిండ బూడద పూసుకుని ఉండే విధంగా కాకుండా.. బాలయ్యని బోయపాటి డిఫరెంట్ గా చూపించేలా ప్లాన్ చేసారని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా 'BB3' సెట్స్ నుంచి బయటకు వచ్చిన బాలయ్య ఫోటోలో ఆయన లుక్ మరో పాత్రకు సంబధించినదేమో అనే అనుమానాలు కలిగిస్తోంది.
హొలీ పండుగను 'BB3' చిత్ర బృందం సెట్స్ లో సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాలయ్య ఓ చిన్న పాపతో రంగులు పూయించుకుంటున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో బాలయ్య నెరిసిన గడ్డం, చిన్నపాటి జుట్టుతో కొత్తగా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. బాలకృష్ణ ఇంతకముందెన్నడు కనిపించని విధంగా ఉన్న ఈ గెటప్ బీబీ3లో అఘోరా పాత్రకు సంబంధించినదని అందరూ భావిస్తున్నారు. ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారికంగా లుక్ రిలీజ్ అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.
కాగా, ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 28న విడుదల చేయనున్నారు. ఇందులో చిత్రంలో 'అఖిల్' బ్యూటీ సయేషా సైగల్ - 'కంచె' ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూర్ణ కీలక పాత్ర పోషిస్తోంది. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. 'సింహా' 'లెజెండ్' వంటి హిట్ సినిమాల తర్వాత బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై నందమూరి ఫ్యాన్స్ భారీ ఆశలే పెట్టుకున్నారు.