Begin typing your search above and press return to search.

బిబి3 అప్‌డేట్‌ తో వారు నిరుత్సాహం

By:  Tupaki Desk   |   1 April 2021 6:43 AM GMT
బిబి3 అప్‌డేట్‌ తో వారు నిరుత్సాహం
X
నందమూరి బాలకృష్ణ.. బోయపాటిల కాంబోలో రూపొందుతున్న సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సింహా మరియు లెజెండ్‌ వంటి సూపర్‌ హిట్‌ కాంబో అవ్వడం వల్ల అంచనాలు సహజంగానే భారీగా ఉంటాయి. అంచనాలకు తగ్గట్లుగా దర్శకుడు బోయపాటి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమాలో బాలకృష్ణ కొన్ని సీన్స్‌ లో అఘోరా లుక్‌ లో కనిపించబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. బాలయ్యను అఘోరాగా చూడలేం అంటూ అభిమానులు మొదటి నుండి చెబుతున్నారు. కాని బోయపాటి మాత్రం కన్విన్సింగ్‌ గా ఆ సీన్స్‌ ను మరియు లుక్‌ ను తీసుకు వస్తానంటూ ఒప్పించే ప్రయత్నం చేశాడు. సినిమా లాక్‌ డౌన్‌ సమయంలో ఆగిపోవడంతో అప్పుడు బాలయ్య కూడా ఆలోచించి అఘోరా లుక్‌ వద్దంటూ బోయపాటికి సూచించడంతో ఆ సన్నివేశాలను రీ ప్లాన్‌ చేశారట.

బాలయ్య అఘోరా పాత్రలో కాకుండా మరో విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడని తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. బాలయ్య అఘోరాలా కనిపిస్తే ఆ లుక్‌ ను మీమ్స్‌ కసం వినియోగించుకోవాలని సోషల్‌ మీడియా మీమ్‌ క్రియేటర్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా చిత్ర యూనిట్‌ ప్రకటనతో వారు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య ఇప్పటికే మీమర్స్‌ కు మంచి అవకాశం. ఇక అఘోరాగా కనిపిస్తే ఇంకా ఏమైనా ఉందా.. వారికి పండగే అనడంలో సందేహం లేదు. అందుకే బాలయ్య అఘోరాగా నటించక పోవడం వారికి నిరుత్సాహంగా ఉండి ఉంటుంది. ఉగాదికి ఈ సినిమా టైటిల్‌ ను ప్రకటించబోతున్నారు. ఇక ఈ సినిమాను మే 28న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చిన విషయం తెల్సిందే. ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌ గా పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ను మిర్యాల రాజేందర్‌ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.