Begin typing your search above and press return to search.

బాలయ్య నెక్స్ట్ లెవెల్ ...?

By:  Tupaki Desk   |   6 Nov 2021 5:00 PM IST
బాలయ్య నెక్స్ట్ లెవెల్ ...?
X
బాలయ్య ఎప్పటి నుంచో నటిస్తున్నాడు. పద్నాలుగేళ్ల ప్రాయం నుంచే ఆయన నటన మొదలైంది. తండ్రి ఎన్టీయార్ తో కలసి ఏకంగా పదకొండు మూవీస్ చేశాడు. ఇది నిజంగా ప్రపంచ రికార్డు. ఇక రెండు పాత్రలలో ఎక్కువ సినిమాలు నటించిన నటుడిగా కూడా బాలయ్య మరో రికార్డు క్రియేట్ చేశాడు. 1974 నుంచి ఈ రోజు వరకూ ఎక్కడా ఆపకుండా నటిస్తూనే ఉండడం ద్వారా మరో రికార్డుని బాలయ్య సొంతం చేసుకున్నాడు.

వందకు పైగా మూవీస్ లో నటించిన బాలయ్య అందులో కూడా ఇండస్ట్రీ హిట్స్. బ్లాక్ బస్టర్ హిట్లూ చాలానే కొట్టాడు. అయితే బాలయ్య మొదట్లో పెద్ద బ్యానర్లలో టాప్ డైరెక్టర్స్ తో టాప్ హీరోయిన్స్ తో నటించినా తరువాత మాత్రం అంతా కొత్త వారితోనే చేశాడు. బాలయ్య అలా చేయడం వల్ల ఆయనకు మేలు జరిగింది ఏమీ లేకపోగా కొన్ని సార్లు మిస్ కాస్టింగ్, సరైన బ్యానర్, డైరెక్టర్, హీరోయిన్ లేకపోవడంతో మూవీస్ హిట్ కావాల్సినవి కూడా దెబ్బ తిన్నాయి.

అయితే బాలయ్య ప్రస్తుత కెరీర్ గురించి చెప్పాలి అంటే అఖండ ముందు తరువాత అనాలేమో. ఎందుకంటే అఖండ మూవీ ముందు కూడా బాలయ్య మార్కెట్ ఏమంత బాగా లేదు. ఆయన కెరీర్ లో డిజాస్టర్స్ కొన్ని అలా వచ్చి పడ్డాయి. అయితే అఖండ షూటింగ్ దశ నుంచి హైప్ ని ఒక్కసారిగా పెంచేసింది. తొందరలో ఈ మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఆ మూవీ రిజల్ట్ కూడా ఏంటో తెలియకుండానే బాలయ్యతో సినిమాలు తీయడానికి టాప్ బ్యానర్స్ క్యూ కట్టడం అంటే నిజంగా గ్రేటే అని చెప్పాలి.

అఖండ తరువాత బాలయ్య గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు. దీనికి జై బాలయ్య అనుకుంటున్నారు. ఈ మూవీలో హీరోయిన్ శృతి హాసన్. చాలా కాలానికి బాలయ్య పక్కన ఒక స్టార్ హీరోయిన్ జత కట్టడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేదు. ఇక ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ తీస్తున్నారు. వారి నిర్మాణం, ప్రమోషన్స్ ఎలా ఉంటాయో ఊహించవచ్చు. విలన్ గా కన్నడ విజయ్ నటిస్తున్నాడు. మ్యూజిక్ థమన్. ఇలా అన్నీ కుదిరిపోయాయి.

అలాగే ఒక్క ఫ్లాప్ లేని అనిల్ రావిపూడి తో బాలయ్య ఒక మూవీ చేస్తున్నాడు అంటున్నారు. అలాగే మరో మంచి బ్యానర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ లో కూడా బాలయ్య నటిస్తారు అని టాక్. ద ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ మీద మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ బాలయ్యతో మూవీ చేస్తారు అన్న వార్తలకే ఫ్యాన్స్ కి పూనకాలు వస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీమంచి శకునములే అన్నట్లుగా వుంది. బాలయ్యలో మంచి నటుడు ఉన్నాడు. అది అందరికీ తెలిసిన నిజం. ఆయన్ని సరిగ్గా వాడుకుంటే బ్లాక్ బస్టర్స్ వస్తాయి. ఇపుడు చూడబోతే అలాంటి కాంబోలే సెట్ అవుతున్నాయి. అంటే బాలయ్య నెక్స్ట్ లెవెల్ ఏంటో ఫ్యాన్స్ తో పాటు అంతా చూసేస్తారు అన్న మాటేగా.