Begin typing your search above and press return to search.
బాలయ్య-రవితేజ కాంబోని సెట్ చేస్తున్న క్రాక్!
By: Tupaki Desk | 20 July 2022 11:30 AM GMTనటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా 107వ సినిమా మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. బాలయ్య మాస్ ఇమేజ్ కి ఏమాత్రం తగ్గకుండా గోపీచంద్ మార్క్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. డైరెక్టర్ గత కమర్శియల్ సక్సెస్ లు చూసి బాలయ్య ఇచ్చిన అవకాశమిది.
ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఎంతైనా గోపీచంద్ మలినేనిపై ఉంది. ఆయన సక్సెస్ ట్రాక్ కూడా బాగానే ఉంది. ఈ నేపథ్యంలో బాలయ్య 107 సెట్ లో ఉండగానే మరో సినిమాకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? అంటే అవుననే విషయం వెలుగులోకి వస్తుంది. అయితే ఇది బాలయ్య సోలో హీరోగా కాకుండా....మల్టీస్టారర్ గా ఆ చిత్రాన్ని మలిచే అవకాశం ఉందని వినిపిస్తుంది.
బాలకృష్ణ-రవితేజ కథనాయకులుగా ఓ మల్టీస్టారర్ ని తెరకెక్కిస్తే బాగుంటుందన్న ఆలోచన గోపీచంద్ లో మొదలైనట్లు క్లోజ్ సోర్సెస్ ద్వారా లీకైంది. గోపీచంద్ కి ఇలాంటి ఆలోచన తట్టడానికి కారణం బాలయ్య అనే అంటున్నారు. ఆ మధ్య బాలయ్య హోస్ట్ గా చేసిన ఆహా ఆన్ స్టాపబుల్ షో కి రవితేజ-గోపీచంద్ హాజరైన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో బాలయ్య-రవితేజ వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయన్నది అర్ధమైంది. ఇద్దరు ఒకే మనస్తత్వం గలవారు. కల్మషం లేని మనుషులు. సహాయం అనగానే స్పందించే హృదయం ఉన్నవారు. అభిమానుల్ని అన్నదమ్ములా ట్రీట్ చేసే వ్యక్తిత్వం. ఏ విషయంపైనైనా ఓ పెన్ గా మాట్లాడే ధైర్య వంతులు. బాలయ్య ఓ అడుగు ముందుకేసి రవితేజతో ఇలాంటి సెట్ల కాకుండా.. లైట్లు ఆపేసికుని..ఓ చెట్టు కింద కూర్చోని బట్టలిప్పుకుని మరీ మాట్లాడుకోవాలోయ్ అన్నారు.
దానికి రవితేజ తప్పకుండా. అలా మాట్లాడుకుంటేనే నిజాలు బయటకొస్తాయన్నారు. ఇలా బాలయ్య-రవితేజ మధ్య వ్యక్తిగతంగా చాలా విషయాలు సింక్ అయ్యాయి. అప్పటి నుంచి ఈ ద్వయం బాండింగ్ మరింత స్ర్టాంగ్ అయింది. ఇవన్నీ గోపీచంద్ దగ్గరుండి చూసాడు. ఈ నేపథ్యంలో ఇద్దరితో సరైన కమర్శియల్ సినిమా చేస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోతుందన్న ఆలోచన తట్టిందిట.
ఆ క్షణం నుంచే ఇద్దర్నీ దృష్టిలో పెట్టుకుని ఓ కథ సిద్దం చేయమని తన రైటింగ్ టీమ్ తో మాట మంతి జరుపుతున్నారుట. అదే గనుక నిజమైతే నిజంగా గుడ్డలూడదీసి మాట్లాడుకునే కథ సిద్దం అవ్వొచ్చు. ఆలోచన బాగానే ఉంది. కానీ ముందు గోపీచంద్ 107 వ సినిమాతో బాలయ్య కి హిట్ ఇచ్చి నిరూపించాలి. ఆ తర్వాతే నమ్మడానికి అవకాశం ఉంటుంది. హిట్ ఇస్తే బాలయ్య మరో ఆలోచన లేకుండా పిలిచి మరీ సినిమా చేద్దాం అంటారు. మరి ఇది ఎంత వరకూ సాధ్యమవుతుందో చూద్దాం.