Begin typing your search above and press return to search.

'హిట్ -2' స‌క్సెస్ పై బాల‌య్య రియాక్ష‌న్ ఇది!

By:  Tupaki Desk   |   5 Dec 2022 4:56 AM GMT
హిట్ -2 స‌క్సెస్ పై బాల‌య్య రియాక్ష‌న్ ఇది!
X
యంగ్ హీరో అడ‌వి శేష్ న‌టించిన 'హిట్ -2' హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. మ‌ర్డ‌ర్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ కి ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌డుతున్నారు. సినీ ప్ర‌ముఖులు సైతం మెచ్చిన చిత్రంగా నిలిచింది. ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్ మ‌హేష్ స‌క్సెస్ నేప‌థ్యంలో సినిమా ఎప్పుడు చూపిస్తున్నావ్ అని శేష్ నే అడిగేసారు. సినిమా చూడ‌టానికి ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నాన‌న్నారు.

తాజాగా న‌ట‌సింహ బాల‌కృష్ణ కూడా సినిమా చూసిన అనంత‌రం త‌న సంతోషాన్ని పంచుకున్నారు. కుమారుడు మోక్షజ్ఞ‌త‌లో క‌లిసి బాల‌య్య సినిమా వీక్షించారు. అల్టిమేట్ థ్రిల్ల‌ర్ అంటూ బాల‌య్య ఆకాశానికి ఎత్తేసారు. దీంతో బాలకృష్ణను హిట్‌వర్స్‌లో భాగం చేయమని శేష్ ఒక జోక్ కూడా వేసాడు. శేష్ వ్యాఖ్యలకు స్మైల్ ఇచ్చిన బాలకృష్ణ నో చెప్పలేదు.

అయితే బాలకృష్ణ హిట్ వర్స్ లో భాగమైతే బావుంటుంది అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మ‌రి దీనికి బాల‌య్య ఏమంటారో చూడాలి. బాల‌య్య నుంచి ప్ర‌శంస‌లు అందుకున్నారు? అంటే దాన్నిగ్రేట్ అచీవ్ మెంట్ గానే చెప్పాలి. సాధ‌ర‌ణంగా బాల‌య్య ఇత‌ర హీరోల సినిమాలు చూడ‌రు.

త‌న సినిమాలు చూడ‌టం...ఖాళీ ఉంటే ధ్యానం చేసుకోవ‌డం..రేర్ గా కావాల్సిన వాళ్లు ఈవెంట్లు ఏవైనా ఉంటే హాజ‌ర‌వ్వ‌డం త‌ప్ప ఆయ‌న పెద్ద‌గా బ‌య‌ట క‌నిపించ‌రు.

అలాంటిది 'హిట్ -2' సినిమా చూడ‌టం..దాన్ని బాగుంద‌ని మెచ్చుకోవ‌డం..ఆపై సినిమా టీమ్ తో క‌లిసి ఫోటోలు దిగ‌డం అంటే? ఇదంతా బాల‌య్య లోవ‌చ్చిన కొత్త మార్పుగానే క‌నిపిస్తుంది. ఇలా బాగున్న సినిమాల్నిప్ర‌శంసించ‌డం అన్న‌ది చాలా కాలంగా మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నారు. ఆయ‌న కు ఆహ్వానం అందేలే గానీ చిన్న సినిమాల్ని ప్రోత్స‌హించ‌డం ముందుటారు.

త‌న ఇంటికి పిలిపించుకుని అవ‌స‌ర‌మైన స‌హ‌కారం చేస్తుంటారు. ద‌ర్శ‌క‌ర‌త్న‌దాస‌రి నారాయాణరావు ఉన్నంత కాలం ఆ బాధ్య‌త‌లు అన్నింటిని ఆయ‌నే చూసుకునే వారు. ఇప్పుడాయ‌న స్థానంలోచి చిరంజీవి వ‌చ్చార‌ని చాలా కాలంగా ప్ర‌చారం సాగుతోంది. కానీ త‌న‌కు ఇండ‌స్ర్టీ బిడ్డ‌గానే ఉండాల‌ని ఉంది త‌ప్ప పెద్ద‌గా కాద‌ని చాలా సంద‌ర్భాల్లో రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.