Begin typing your search above and press return to search.
థియేటర్ల సమస్య.. బాలయ్య రియాక్షన్ ఏంటీ?
By: Tupaki Desk | 14 Nov 2022 5:43 AM GMTనందమూరి బాలకృష్ణ 'అఖండ' మూవీతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యాభై శాతం ఆక్యుపెన్సీలోనూ కలెక్షన్ ల ప్రభంజనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మూవీ అందించిన సక్సెస్ జోష్ తో వున్న బాలయ్య రెట్టించిన ఉత్సాహంతో 'క్రాక్'తో లైన్ లోకి వచ్చేసిన గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ 'వీర సింహారెడ్డి' చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తోంది.
శృతిహాసన్ తొలి సారి బాలయ్యకు జోడీగా నటిస్తున్న ఈ మూవీని 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య', విజయ్ నటిస్తున్న 'వారసుడు', అజిత్ 'తునీవు' రిలీజ్ కాబోతున్నాయి. దీంతో చాలా వరకు తెలుగు సినిమాలకు థియేటర్ల సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరీ ప్రధానంగా బాలకృష్ణ నటిస్తున్న 'వీర సింహారెడ్డి' మూవీకి ప్రధాన థియేటర్ల సమస్యల తలెత్తుతున్నట్టుగా తెలుస్తోంది.
నెల రోజుల ముందు నుంచే దిల్ రాజు తాను డబ్బింగ్ చేస్తున్న సినిమాల కోసం థియేటర్లని కబ్జా చేసుకుంటూ వెళ్లారని, అంతే కాకుండా ఎగ్జిబిటర్లలో ఇప్పటికే అగ్రిమెంట్ లు చేయించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
నైజామ్ ఏరియాలో మెయిన్ థియేటర్లు చాలా వరకు బాలకృష్ణ సినిమాలకు లభించడం లేదన్నది తాజా టాక్. దీనిపై మైత్రీ మూవీమేకర్స్ వారు ఫైట్ చేస్తున్నా ఫలితం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బాలయ్య రియాక్షనర్ ఏంటీ? ఎలా వుండబోతోందనే చర్చ మొదలైంది.
గతంలో టాలీవుడ్ షూటింగ్ ల బంద్ సమయంలో బాలకృష్ణ 'వీర సింహారెడ్డి' షూటింగ్ ని మేకర్స్ నిలిపి వేశారు. అయితే బాలయ్య మాత్రం ఎట్టిపరిస్థితుల్లో షూటింగ్ ఆపకూడదని, మొదలు పెట్టాల్సిందేనని హుకుం జారీ చేశారట. అదే సమయానికి ప్రొడ్యూసర్స్ గిల్డ్ వారు షూటింగ్ లకు అమతివ్వడం.. ఆ తరువాత అన్ని సినిమాల షూటింగ్ లు యధా విధిగా తిరిగి ప్రారంభం కావడం తెలిసిందే. షూటింగ్ విషయంలోనే మాట వినని బాలయ్య తన సినిమాకు మెయిన్ థియేటర్లు దొరక్కుండా చేస్తున్నారంటే ఊరుకుంటారా? అన్నది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
అంతే కాకుండా గతంలో కొన్ని సినిమాల టైటిల్ వివాదం విషయంలోనూ బాలయ్య ఎంట్రీ ఇవ్వడం అవతలి పార్టీ సైలెంట్ అయిపోయి బాలయ్య సరెండర్ కావడం జరిగింది. ఇవన్నింటినీ దృష్టిదలో పెట్టుకుని తన సినిమాకు థియేటర్లు లభించడం లేదంటే బాలయ్య ఊరుకుంటాడా?.. రంగంలోకి దిగి రఫ్పాడించేయడూ అనే కామెంట్ లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. వన్స్ బాలయ్య స్పెప్ ఇన్ అయితే థియేటర్ల వివాదానికి ఎండ్ కార్డ్ పడుతుందని ఇన్ సైడ్ టాక్. థియేటర్ల సమస్యపై బాలయ్య రియాక్షన్ ఏంటన్నది త్వరలోనే బయటికి రానుందని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.