Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్: 2023లో మోక్ష‌జ్ఞ తెరంగేట్రం

By:  Tupaki Desk   |   20 Aug 2022 3:02 AM GMT
ట్రెండీ టాక్: 2023లో మోక్ష‌జ్ఞ తెరంగేట్రం
X
న‌ట‌వార‌సుల సినీ ఆరంగేట్రం అన్నివేళ‌లా ఉత్కంఠ‌ను క‌లిగించే అంశం. అభిమానుల్లో సామాన్య ప్ర‌జ‌ల్లో దీనిపై ఎక్కువ చ‌ర్చ సాగుతుంటుంది. మీడియా డిబేట్లు ఆస‌క్తిని పెంచుతాయి. బాలీవుడ్ టు టాలీవుడ్ ఈ స‌న్నివేశం క‌నిపిస్తోంది.

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ... అక్కినేని కుటుంబం స‌హా నంద‌మూరి కాంపౌండ్ లోని న‌ట‌వార‌సుల రాక గురించి ఎక్కువ‌గా చ‌ర్చ సాగుతుంది. నాలుగేళ్ల క్రితం అక్కినేని న‌ట‌వార‌సుడు అఖిల్ తెరంగేట్రం చేసిన‌ప్పుడు.. రెండేళ్ల క్రితం మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగింది.

అయితే అఖిల్ తెరంగేట్రం చేసే స‌మ‌యంలోనే నంద‌మూరి మోక్ష‌జ్ఞ సినీఎంట్రీ గురించి కూడా చ‌ర్చ మొద‌లైంది. కానీ ఈ నాలుగైదేళ్ల‌లో మోక్షు ప్రిప‌రేష‌న్ ఆ దిశ‌గా సాగిన‌ట్టు క‌నిపించ‌లేదు. దీనిపై నంద‌మూరి అభిమానులు స‌హా కామ‌న్ జ‌నాల్లో బోలెడంత చ‌ర్చా సాగింది. బాల‌య్య వార‌సుడు మోక్ష‌జ్ఞ న‌ట‌న‌పై ఆస‌క్తిగా లేడ‌ని కూడా గుస‌గుస స్ప్రెడ్ అయ్యింది.

అయితే మోక్ష‌జ్ఞ సినీఎంట్రీపై న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ స్వ‌యంగా క్లారిటీనివ్వ‌డంతో ఆ త‌ర్వాత గుస‌గుస‌లు స‌ద్ధుమ‌ణిగాయి. మోక్ష‌జ్ఞ వ‌స్తాడు.. అయితే కాస్త ఆల‌స్య‌మ‌వుతుంది. అయితే దీనిపైనా ఇప్పుడు క్లారిటీ వ‌చ్చేస్తోంది. మోక్షజ్ఞ సినీఎంట్రీకి ఇంకా ఎంతో స‌మ‌యం ప‌ట్ట‌దు. 2023లో అత‌డి సినీఆరంగేట్రం ఉంటుంది. ప్ర‌స్తుతం అత‌డు త‌న శ‌రీరాకృతిని తీర్చిదిద్దుకునే ప‌నిలో ఉన్నాడు. అందుకు జిమ్ లో తీవ్రంగా క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. ఇప్ప‌టికే అత‌డు చాలా బ‌రువు త‌గ్గాడ‌ని కూడా తెలుస్తోంది.

ఇక న‌ట‌సింహా లెగ‌సీని ముందుకు తీసుకెళ్లే నందమూరి వార‌సుడిగా అత‌డిని అభిమానులు ప్ర‌జ‌లు చూస్తున్నారు. మోక్షు డెబ్యూ చిత్రానికి త‌న తండ్రి గారైన బాల‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించేందుకు ఛాన్స్ లేక‌పోలేద‌ని కూడా టాక్ వినిపిస్తోంది. ఆదిత్య 999 మ్యాక్స్ అనే టైటిల్ ని బాల‌య్య బాబు ఇదివ‌ర‌కూ ప్ర‌క‌టించారు. లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీ‌నివాస‌రావు తెర‌కెక్కించిన ఆదిత్య 369 కి ఇది సీక్వెల్ క‌థాంశం అని కూడా వెల్ల‌డైంది.

ప్ర‌స్తుతం నందమూరి మోక్షజ్ఞ లుక్ ఎలా ఉంది? అన్న‌ది తెలుసుకునేందుకు అత‌డి తాజా ఫోటో ఆన్ లైన్ లో వైరల్ అవుతోంది. గత రాత్రి హైదరాబాద్ లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్ తో కలిసి మోక్షజ్ఞ కనిపించారు. నోవాటెల్ లో జరిగిన ఫీనిక్స్ గ్రూప్ ఛైర్మన్ చుక్కపల్లి సురేష్ 60వ పుట్టినరోజుకు మోక్షజ్ఞ హాజరయ్యారు.

ఈ ఈవెంట్ లో మోక్షజ్ఞ అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను పెద్దలను వినయంగా పలకరించాడని కొంతమంది పెద్దలు తనను పలకరించడానికి వచ్చినప్పుడు నిలబడి ఉంటాడని చూపరులు ముచ్చ‌టించుకున్నారు. మోక్ష‌జ్ఞ ఎంతో డీసెంట్ ప‌ర్స‌నాలిటీ. పెద్ద‌లను గౌర‌వించే సంస్కృతితో అంద‌రినీ ఆక‌ర్షిస్తారు. తండ్రి న‌ట‌వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకుని పెద్ద స్టార్ అవుతాడ‌న్న గుస‌గుసా ఆ ప్రాంగ‌ణంలో వినిపించింది. అయితే అత‌డు డెబ్యూ చిత్రంతో అభిమానుల ముందుకు వ‌చ్చేప్ప‌టికి లుక్ ప‌రంగా చాలా మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్ర‌స్తుత తీరిక స‌మ‌యాల్లో దానిపై అత‌డు దృష్టి సారించాడ‌ని కూడా చెబుతున్నారు.