Begin typing your search above and press return to search.
బాలయ్యకు శస్త్రచికిత్స .. ఆరువారాల విశ్రాంతి
By: Tupaki Desk | 2 Nov 2021 12:21 PM GMTటాలీవుడ్ అగ్రహీరో, హిందూపూర్ టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలక్రిష్ణ కుడిభుజానికి శస్త్రచికిత్స నిర్వహించారు. గత ఆరు నెలలుగా బాలయ్య భుజం నొప్పితో బాధ పడుతున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 31 తేదీన చికిత్స నిమిత్తం బాలయ్య బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రికి వెళ్లారు.
కేర్ ఆస్పత్రి ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రఘువీర్ రెడ్డి, డాక్టర్ బి.ఎన్ ప్రసాద్ ల బృందం నాలుగు గంటల పాటు శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు.ప్రస్తుతం బాలక్రిష్ణ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో ఆయనను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు తెలిపారు.
ఇక 2018లోనూ బాలయ్య భుజం గాయంతో బాధపడ్డారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా షూటింగ్ ఫైట్ సీన్లలో బాలయ్య కింద పడి పోవడంతో కుడి భుజానికి గాయమైంది. భుజం గాయం ఎక్కువ కావడంతో నాడు హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో బాలయ్య భుజానికి శస్త్రచికిత్స చేశారు. నాడు కోలుకున్న బాలయ్య తిరిగి అదే భుజం తిరగబెట్టడంతో తాజాగా మరోసారి ఆపరేషన్ చేయించుకున్నారు.
ప్రస్తుతం బాలయ్య .. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ మూవీలో నటిస్తున్నారు. అంతేకాకుండా బుల్లితెరపై ఆహా ఓటీటీలో ‘అన్ స్టాపబుల్’ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు.బాలయ్య కోలుకోవడానికి ఆరువారాలు పడుతుందని వైద్యులు తెలిపారు.