Begin typing your search above and press return to search.
బాలయ్య... సల్మాన్ ని మించేశాడే... ?
By: Tupaki Desk | 6 Dec 2021 12:30 AM GMTనందమూరి బాలక్రిష్ణ పూర్తిగా టాలీవుడ్ కే పరిమితం అయిన హీరో. సూపర్ స్టార్ డమ్ ఉంది కానీ ఎందుకో హిందీ సినిమా రంగం వైపు ఇంటరెస్ట్ పెట్టలేదు. అప్పట్లో ఆయన హిందీ సినిమాల్లో నటిస్తాను అని స్టేట్మెంట్స్ ఇచ్చారు కానీ అది ఏ కారణాల వల్లనో మెటీరియలైజ్ కాలేదు. మొత్తానికి టాలీవుడ్ లో టాప్ ఫోర్ సీనియర్ హీరోలలో ఒక్క బాలయ్య తప్ప చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ బాలీవుడ్ లో ఎన్నో కొన్ని సినిమాలు చేసిన వారే.
దాని సంగతి అలా ఉంచితే బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ని బాలయ్య మించాడు అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. అదేంటి బాలయ్య సల్మాన్ తో పోటీకి వెళ్ళడమేంటి, ఆయన్ని దాటేయడమేంటి అన్న చర్చ సహజంగా వస్తుంది. కానీ ఇది నిజమే.
బాలయ్య లేటెస్ట్ హిట్ అఖండ మూవీ మూడు రోజుల కలెక్షన్స్ తీసుకుంటే అక్షరాలా 35 కోట్లు పై దాటాయి. అదే టైమ్ లో సల్మాన్ ఖాబ్ లేటెస్ట్ రిలీజ్ అంతిమ్ మూవీ ఎనిమిది రోజుల కలెక్షన్లు తీసుకుంటే ముప్పయి కోట్లకు మించలేదు. ఇక వీకెండ్ కలెక్షన్లు తీసుకున్నా కూడా అంతిమ్ కేవలం పదిహేడు కోట్లు మాత్రమే వసూల్ చేస్తే బాలయ్య అఖండ నలభై కోట్లను దాటేసినట్లుగా లెక్కలు చెబుతున్నాయి.
మరి ఈ విధంగా చూసుకుంటే మాత్రం బాలయ్య కేవలం రీజనల్ హీరోగా ఉంటూనే ఇంత పెద్ద ఎత్తున కలెక్షన్లు రాబట్టడం గ్రేట్ అంటున్నారు. ఇక అఖండకు పొటెన్షియాలిటీ చాలానే ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ మూవీ లాంగ్ రన్ లో కచ్చితంగా అరవై డెబ్బై కోట్లను వసూల్ చేస్తుందని, కరోనా రెండవ వేవ్ తరువాత కేవలం టాలీవుడ్ కే కాకుండా బాలీవుడ్ కి కూడా స్పూర్తిగా నిలుస్తుంది అంటున్నారు. మొత్తానికి బాలయ్య లాంటి హీరో స్టామినా ఏంటో అఖండ ప్రూవ్ చేసింది అనుకోవాలి.