Begin typing your search above and press return to search.

బాలయ్య టాక్‌ షో... ప్రభాస్‌ పెళ్లినా? చరణ్‌ వారసుడా?

By:  Tupaki Desk   |   13 Dec 2022 11:01 AM GMT
బాలయ్య టాక్‌ షో... ప్రభాస్‌ పెళ్లినా? చరణ్‌ వారసుడా?
X
నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్‌ టాక్ షో లో ప్రభాస్ మరియు గోపీచంద్‌ సందడి చేసిన విషయం తెల్సిందే. ఆ ఎపిసోడ్‌ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్‌ అవుతుందా అంటూ ప్రభాస్ అభిమానులతో పాటు ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ ఎపిసోడ్‌ లో కచ్చితంగా బాలయ్య నుండి ప్రభాస్ కు పెళ్లి సంబంధించిన ప్రశ్న ఉంటుంది.. అప్పుడు ప్రభాస్ ఎలా రియాక్ట్‌ అవుతాడు అనేది అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్ మరియు గోపీచంద్‌ లతో పాటు బాలయ్య తో ఆన్ లైన్‌ ద్వారా రామ్‌ చరణ్ కూడా మాట్లాడాడు అనేది టాక్. రామ్‌ చరణ్ మరియు ప్రభాస్ లు మంచి స్నేహితులు. ఇద్దరి మధ్య వీడియో కాల్ ద్వారా అన్ స్టాపుబుల్‌ షో లో సంభాషణలు జరిగాయి అంటూ ఆహా టీమ్‌ లీక్ ఇచ్చి షో పై మరింత ఆసక్తిని రేకెత్తించింది.

ఈ షో లో ఒక గుడ్‌ న్యూస్ ను చెప్పబోతున్నట్లుగా రామ్‌ చరణ్ అన్నాడని.. ప్రభాస్ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

గుడ్‌ న్యూస్ ఏంటీ.. ఇంతకు ఎవరు చెప్తారు అనే విషయంలో మాత్రం స్పష్టత లేకుండా ఉంది.

రామ్‌ చరణ్ తండ్రి కాబోతున్నాడు అనే విషయం తాజాగా రివీల్ అయ్యింది. మెగా స్టార్ చిరంజీవి ఆ విషయాన్ని రివీల్‌ చేసిన విషయం తెల్సిందే. ఆ గుడ్‌ న్యూస్‌ మాత్రమేనా ప్రభాస్‌ పెళ్లి గురించి ఏమైనా గుడ్‌ న్యూస్ ను బాలకృష్ణ టాక్‌ షో లో చెప్పబోతున్నాడా అనేది అందరిలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్‌ అయితే కానీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది క్లారిటీ వస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.