Begin typing your search above and press return to search.
బాలయ్య కూడా దాటేశాడు.. ఆ ఇద్దరే... ?
By: Tupaki Desk | 12 Dec 2021 5:30 PM GMTటాలీవుడ్ ఎపుడూ ప్రత్యేకమైనదే అని చెప్పాలి. ఇక్కడ ఉన్న స్టార్లూ సూపర్ స్టార్లూ మరే ఇండస్ట్రీలోనూ లేరు అని చెప్పాలి. అంతే కాదు, ఆరు పదులు దాటినా కూడా హీరో రోల్స్ వేస్తూ తమ ఇమేజ్ ని కాపాడుతున్న వారంతా టాలీవుడ్ లోనే ఎక్కువ. టాలీవుడ్ లో ఎనభై, తొంబై దశకంలో చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేష్ ల మధ్య టఫ్ ఫైట్ నడిచేది. ఒకరు భారీ సక్సెస్ ఇస్తే మరొకరు దాన్ని దాటుకుని వెళ్ళేవారు.
ఇలా పోటీ చాలా ఆసక్తికరంగా ఉంటూ వచ్చింది. 2000 తరువాత యంగర్ జనరేషన్ రావడంతో సీనియర్ల దూకుడు కాస్తా తగ్గింది. అయినా కానీ నాటౌట్ అంటూ సినిమాలు చేస్తూనే ఉన్నారు. హిట్లు కొడుతూనే ఉన్నారు. ముఖ్యంగా మాస్ హీరోలు చిరంజీవి బాలయ్య అయితే పోటా పోటీగా ఈ రోజుకీ దూసుకు వస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తరువాత చేసిన ఖైదీ నంబర్ 150 మూవీతో వంద కోట్ల క్లబ్ లో ఈజీగా చేరిపోయాడు. ఒక విధంగా చిరంజీవి ఏ టార్గెట్ పెట్టుకోకుండానే రీచ్ అయ్యాడు. ఇక బాలయ్యను తీసుకుంటే గౌతమి పుత్ర శాతకర్ణితో ఫస్ట్ టైమ్ యాభై కోట్ల క్లబ్ లోకి వచ్చాడు. ఇక వంద కోట్లను టార్గెట్ చేస్తూ తన తండ్రి జీవిత కధను ఆధారంగా చేసుకుని తీసిన కధా నాయకుడు, మహానాయకుడు మూవీస్ తీవ్రంగా నిరాశ పరచాయి. దాంతో బాలయ్య వందకోట్ల కల అయ్యే పనేనా అన్న డౌట్లు కూడా ఒక దశలో వచ్చాయి.
కానీ బాలయ్య తాను నమ్మిన బోయపాటి శ్రీను ద్వారానే ఆ టార్గెట్ ని ఈసారి చాలా అవలీలగా చేదించాడు. కేవలం పది రోజుల వ్యవధిలో వంద కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి బాలయ్యా మజాకా అంటోంది అఖండ. దాంతో సీనియర్ హీరోలలో చిరంజీవి తరువాత ఈ సెంచరీ క్లబ్ లో చేరిన రెండవ సీనియర్ బాలయ్య అని చెప్పాలి.
ఇక మిగిలింది వెంకటేష్, నాగార్జున, నాగార్జున స్టామినా ఏంటో సోగ్గాడే చిన్న నాయన మూవీ చూపించింది ఈ మూవీ సూపర్ హిట్ తో ఆయన యాభై కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. మరి వంద కోట్ల క్లబ్ లోకి ఎపుడు ఎంట్రీ ఇస్తాడు అన్నదే చూడాలి. బంగార్రాజు మూవీ మీద మంచి అంచనాలు ఉన్నాయి. వెంకటేష్ ని తీసుకుంటే ఆయన మరో హీరో వరుణ్ తేజ్ తో కలసి చేసిన సినిమా ఎఫ్ టూ తో ఎనభై కోట్ల దాకా వసూళ్ళు సాధించారు. అయితే ఆ క్రెడిట్ మొత్తం వెంకీ ఖాతాలో పూర్తిగా పడదు
ఇపుడు వెంకీ కొన్ని ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ని ముందు పెట్టుకున్నాడు. వాటిలో ఆయన 75వ సినిమా కూడా ఉంది. సో వెంకీ ఈ ఫీట్ ని సాధించేందుకు చూస్తున్నాడు అంటున్నారు. మొత్తానికి టాప్ సీనియర్స్ నలుగురు వంద కోట్ల క్లబ్ లో చేరితే టాలీవుడ్ మరో కొత్త రికార్డ్ ని సాధించినట్లు అవుతుంది.