Begin typing your search above and press return to search.
బాలయ్య బరిలోకి దిగితే రికార్డులు దాసోహమే!
By: Tupaki Desk | 6 Jan 2022 9:30 AM GMTటాలీవుడ్ లో బాలయ్యకి మాస్ ఇమేజ్ ఎక్కువ. అందువలన ఆయన తన సినిమాల్లో మాస్ కంటెంట్ పుష్కలంగా ఉండేలా చూసుకుంటూ ఉంటారు. అలా అని చెప్పేసి ఆయన మాస్ సినిమాలు మాత్రమే చేస్తూ ఉండిపోలేదు. 'భైరవ ద్వీపం' వంటి జానపదాలు .. 'శ్రీకృష్ణార్జున యుద్ధం' వంటి పౌరాణికాలు .. 'ఆదిత్య 369' వంటి సైన్స్ ఫిక్షన్ కథలు బాలయ్య మాత్రమే చేయగలరు అని నిరూపించుకున్నారు. తాను చేయాలనుకున్న పనిని చేసేయడమే బాలకృష్ణకి తెలుసు. ఆ విషయంలో ఆలోచనలు చేయడాలు .. నాన్చడాలు ఆయనకి అలవాటు లేని పనులు.
ఆయన చూపించే ఆ తెగింపే ఈ రోజున ఆయనను ఈ స్థాయిలో నిలబెట్టేసింది. బాలకృష్ణ మొదటి నుంచి కూడా గ్యాప్ రాకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారే తప్ప, ఆయన ఎప్పుడూ యాంకర్ గా గానీ .. హోస్ట్ గా కానీ బుల్లితెరపై కనిపించలేదు. ఆయన గెస్టుగా వచ్చిన దాఖలాలు కూడా కనిపించవు. అలాంటి బాలకృష్ణ ఒక టాక్ షో చేయడానికి ఒప్పుకుంటారని ఎవరూ ఉహించలేదు. అది ఈ రోజున ఇంత సక్సెస్ అవుతుందని ఎవరూ అనుకోలేదు. అలా ఈ విషయంలోను బాలయ్య తన ప్రత్యేకతను చాటుకున్నారు.
బాలయ్య 'ఆహా' ఓటీటీ కోసం 'అన్ స్టాపబుల్' టాక్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇంతవరకూ 7 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయ్యాయి. 1వ ఎపిసోడ్ ను మోహన్ బాబుతోను .. 2వ ఎపిసోడ్ ను నానితోను .. 3వ ఎపిసోడ్ ను బ్రహ్మానందం - అనిల్ రావిపూడితోను, 4వ ఎపిసోడ్ ను 'అఖండ' టీమ్ తోను .. 5వ ఎపిసోడ్ ను రాజమౌళి - కీరవాణితోను .. 6వ ఎపిసోడ్ ను 'పుష్ప' టీమ్ తోను .. 7వ ఎపిసోడ్ ను రవితేజ - గోపీచంద్ తోను చేశారు. ఇక 8వ ఎపిసోడ్ ను రానాతో చేయగా, ఇది ఈ నెల 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఇక 9వ ఎపిసోడ్ ను పూరి - విజయ్ దేవరకొండతోను .. 10వ ఎపిసోడ్ ను మహేశ్ తోను చేశారు. ఈ సీజన్ కి మహేశ్ బాబు పాల్గొన్నదే చివరి ఎపిసోడ్. ఈ షోలో ఇంతవరకూ స్ట్రీమింగ్ అయిన అన్ని ఎపిసోడ్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. బాలయ్యబాబు ముక్కుసూటి తత్వం .. ఏ విషయాన్ని గురించైనా నిర్మొహమాటంగా అడగడం .. తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడటం ఈ షోకి ప్లస్ అయింది. అలవాటు లేని పనిని అలవోకగా చేసి ఆయన శభాష్ అనిపించుకున్నారు.
అంతేకాదు 'అన్ స్టాపబుల్' టాక్ షోను తెలుగులో నెంబర్ వన్ ప్లేస్ లోను .. ఇండియాలో 5వ ప్లేస్ లోను నిలబెట్టారు. వినోద రంగానికి రేటింగులు .. ర్యాంకులు ఇచ్చే IMDB సంస్థ తాజాగా ఇండియాలోని టాప్ 10 టాక్ షోల లిస్టును విడుదల చేసింది. వాటిలో బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' షో కూడా ఉంది. IMDB వారు ఈ షోకు 9.2 రేటింగ్ ఇచ్చారు. దాంతో ఇది తెలుగులో నెంబర్ 1 షోగా నిలిచింది. ఇండియా లెవెల్లో 5వ స్థానాన్ని దక్కించుకుంది. తొలి ప్రయత్నంలోనే బాలకృష్ణ ఈ ఘనతను సాధించడం .. అరుదైన రికార్డును అందుకోవడం విశేషమే మరి!