Begin typing your search above and press return to search.
మాస్ రాజా తో బాలయ్య అన్ స్టాపబుల్.. ఆ పుకార్లకు చెక్
By: Tupaki Desk | 18 Dec 2021 12:13 PM ISTనందమూరి బాలకృష్ణ ఆహా షో అన్ స్టాపబుల్ సూపర్ సక్సెస్ ఫుల్ గా దూసుకు పోతుంది. బాలయ్య హోస్ట్ గా ఎలా చేస్తాడో అనే అనుమానాలు చాలా మందికి ఉండేవి. కాని ఇప్పుడు అవన్ని పటా పంచలు అయ్యాయి. మొదటి ఎపిసోడ్ ను మోహన్ బాబుతో.. రెండవ ఎపిసోడ్ ను నానితో చేసిన బాలయ్య చేతికి ఆపరేషన్ వల్ల రెండు మూడు వారాల గ్యాప్ తీసుకుని మళ్లీ బ్రహ్మానందంతో అన్ స్టాపబుల్ షో ను కంటిన్యూ చేస్తున్నాడు.
ఈ వారం రాజమౌళి మరియు కీరవాణిలు స్పెషల్ గెస్టు లుగా రాగా తర్వాత వారంకు మాస్ మహారాజా రవితేజ మరియు దర్శకుడు గోపీచంద్ మలినేని గెస్ట్ లుగా రాబోతున్నట్లుగా ఆహా టీమ్ ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే మహేష్ బాబు ఎపిసోడ్ ను షూట్ చేసి పెట్టారు. అది ఏదైనా ప్రత్యేక సందర్బం కోసం హోల్డ్ లో పెట్టినట్లుగా తెలుస్తోంది.
సంక్రాంతికి ఆ ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేసేలా ఆహా వారు ప్లాన్ చేస్తున్నారేమో తెలియాల్సి ఉంది. బాలయ్య అన్ స్టాపబుల్ లో క్రాక్ హీరో రవితేజ మరియు గోపీచంద్ మలినేని రాబోతుండటం చర్చనీయాంశం అయ్యింది.
గత కొంత కాలంగా బాలకృష్ణ మరియు రవితేజల మద్య కాస్త విభేదాలు ఉన్నాయేమో అనే చర్చలు మీడియాలో జనాల్లో జరిగింది. ఎందుకంటే బాలకృష్ణ పలు సినిమాలతో రవితేజ సినిమాలు పోటీ పడ్డాయి. అందులో రవితేజ సినిమాలు పై చేయి సాధించిన సందర్బాలు ఉన్నాయి.
కావాలని పోటీగా బాలయ్య సినిమాకు రవితేజ సినిమాలు పోటీగా వస్తున్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. రవితేజ మరియు బాలయ్య లు బాక్సాఫీస్ వద్ద పలు సందర్బాల్లో ఢీ కొట్టారు. పైగా రవితేజ ను మెగా కాంపౌండ్ మనిషి అని.. అందుకే బాలయ్య కు ఆయన వ్యతిరేకి అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తూ వచ్చారు.
ఇద్దరి మద్య కోల్డ్ వార్ ఎప్పుడు జరుగుతూనే ఉందని.. గత పదేళ్లుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. రవితేజ సినిమాలు ఎన్నో విడుదల అవుతూనే ఉన్నాయి. వాటిలో రెండు మూడు బాలయ్య సినిమాలకు పోటీగా అనుకోకుండా పోటీగా వచ్చి ఉంటాయి.
అంతే తప్ప కావాలని రవితేజ ఆ సినిమా లను బాలయ్యకు పోటీగా విడుదల చేసి ఉండడు అనేది కొందరి అభిప్రాయం అయినా కూడా ఎక్కువ శాతం మంది మాత్రం బాలయ్య టార్గెట్ గానే రవితేజ సినిమా లు వచ్చాయి అంటూ ఇష్టానుసారంగా పుకార్లు పుట్టించే వారు.
ఇప్పుడు ఆహా లో అన్ స్టాపబుల్ ద్వారా ఆ సుదీర్ఘ పుకారును కొట్టి పారేయబోతున్నారు. రవితేజ మరియు బాలకృష్ణల మద్య జరిగే సంభాషణలు ఎలా ఉంటాయి.. ఇద్దరు కూడా సరదాగా పెట్టే ముచ్చట్లు ఏంటీ అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలయ్యను డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన ముచ్చట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. రవితేజ మరియు గోపీచంద్ లతో బాలయ్య చేసే చిట్ చాట్ ఎపిసోడ్ వచ్చే శుక్రవారం స్ట్రీమింగ్ అవ్వబోతుంది.
బాలయ్య అన్ స్టాపబుల్ ఇప్పటి వరకు అన్ని ఎపిసోడ్ లకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రవితేజ తో ఎపిసోడ్ వల్ల ఖచ్చితంగా మరింతగా ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ రావచ్చు అంటున్నారు. ఈ టాక్ షో లో అప్పటి పోటీ గురించి ముందు ముందు పడబోతున్న పోటీ గురించి వీరు ఏమైనా మాట్లాడుకుంటారేమో చూడాలి. మొత్తానికి బాలయ్య అన్ స్టాపబుల్ లో రవితేజ రావడం శుభ పరిణామం అన్నట్లుగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.