Begin typing your search above and press return to search.
ముసలి మడుగు ప్రతాప్ రెడ్డిగా బాలయ్య విలన్!
By: Tupaki Desk | 6 Jan 2023 4:39 AM GMT'వీరసింహారెడ్డి' తో మరోసారి నటసింహ బాలకృష్ణ సీమ పౌరుషాన్ని ప్రదర్శించబోతున్నారు. కొన్నేళ్ల తర్వాత పవర్ ఫుల్ ఫ్యాక్షన్ స్టోరీలో నటించడంతో! అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెరపై 'వీరసింహారెడ్డి' ఎలా కనిపించబోతున్నాడు? అన్న ఎగ్జైట్ మెంట్ కనిపిస్తుంది. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ లో బాలయ్య పంచ్ డైలాగులు..అతని ప్రత్యర్ధి ఎంత బలంగా ఉంటాడు? వంటి అంశాలపై ఆసక్తి నెలకొంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న దునియా అ విజయ్ చిత్రాన్ని ఉద్దేశించి ఆక్తికర వ్యాఖ్యలు చేసారు. ఏ సినిమాకైనా ప్రతి నాయకుడు పాత్ర మూల స్థంబంలా ఉండాలి. ఆ పాత్ర సినిమా మైలేజ్ని పెంచుతుంది. మా లాంటి నటులకు ఆపాత్రలు చెరగని ముద్రవేస్తాయి. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తిండిపోతాం. వీరసింహారెడ్డిలో నా పాత్ర అలాగే ఉంటుంది.
ముసలి ముడుగు ప్రతాప్ రెడ్డి పాత్రలోకనిపిస్తా. లుక్ చాలా మొరటుగా ఉంటుంది. అందరికీ గుర్తిండిపోయే బలమైన పాత్ర ఇది. బాలయ్య తో తెరను పంచుకోవడం సంతోషంగా ఉంది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయనతో తెరను పంచుకోవడం చెప్పలేని అనుభూతినిస్తుంది. తొలిసారి సెట్లో చూసినప్పుడు నన్ను నేను నమ్మలేకపోయా.
సినిమాలో ఆయన పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుంది' అన్నారు. ఇంకా వ్యక్తిగత విషయాలు షేర్చేసారు. " నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. నటుడిగా సక్సెస్ అవ్వాలని పరిశ్రమకి వచ్చాను. అనుకోకుండా హీరో అయ్యాను. కానీ నాకు ఇప్పటికీ హీరో కన్నా ఓ నటుడిగానే ఉండాలనిపిస్తుంది. తెరపై అలా కనిపించడానికి ఎక్కువగా ఇష్పపడతాను.
ఓ నటుడిగా నాలోని అన్ని రకాల కోణాలు ప్రేక్షకులు చూడాలి. అప్పుడే పరిపూర్ణ నటుడిని అనిపించుకుంటా. ఇంకా తెలుగులో కొన్ని కథలు విన్నా. వాటికి సంతకం చేయలేదు. కన్నడలో కొన్నిసినిమాలు సెట్స్ లో ఉన్నాయి' అని అన్నారు. దునియా విజయ్ కన్నడ నటుడ...అక్కడ చాలా సినిమాలు చేసారు. వీరసింహారెడ్డి తో టాలీవుడ్లో తెరంగేట్రం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.