Begin typing your search above and press return to search.

వాలెంటైన్స్ డే డేట్ మార్చాలంటున్న బాలయ్య..!

By:  Tupaki Desk   |   31 Oct 2022 5:04 AM GMT
వాలెంటైన్స్ డే డేట్ మార్చాలంటున్న బాలయ్య..!
X
సీనియర్ స్టార్ హీరోల్లో మనసులో ఏముందో అది మట్లాడటంలో ముందుంటాడు నందమూరి నట సింహం బాలకృష్ణ. వేదిక ఏదైనా సరే బాలయ్య వచ్చాడు అంటే ఆడిటోరియం దద్దరిల్లిపోవాల్సిందే. లేటెస్ట్ గా అల్లు ఫ్యామిలీ హీరో అల్లు శిరీశ్ హీరోగా రాకేశ్ శశి డైరక్షన్ లో తెరకెక్కిన ఊర్వశివో రాక్షసివో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలయ్య గెస్ట్ గా వచ్చారు.

ఈ వేడుకలో బాలయ్య తన స్పీచ్ తో అల్లు ఫ్యాన్స్ ని అలరించారు. మైక్ అందుకున్న బాలయ్య సినిమా హీరో అల్లు శిరీశ్ ని ఓ ఆట ఆడుకున్నాడు. సినిమా ట్రైలర్ లో మసాలా బాగా ఉంది కేవలం సినిమా వరకేనా లేదా బయట కూడానా అని శిరీశ్ ని టీజ్ చేశారు.

సినిమా గురించి చెబుతూ ప్రస్తుతం మనిషి దైనందన జీవితంలో సినిమా ఒక భాగం వారిని ఎంటర్టైన్ చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని అన్నారు. ఇక ఊర్వశివో రాక్షసివో సినిమా ట్రైలర్ చూస్తే మసాలా బాగా ఉన్నటు ఉంది.

సినిమా యూత్ ఆడియన్స్ కి బాగా ఎక్కేస్తుందని అన్నారు బాలయ్య బాబు. అంతేకాదు వాలెంటైన్స్ డే డేట్ ఫిబ్రవరి 14 నుంచి నవంబర్ 4న మార్చి పెట్టాలని.. ఈ సినిమా చూశాక అందరు అదే కోరుతారని అన్నారు. సినిమా ప్రమోషన్స్ కి ఏదో వచ్చామా వెళ్లామా అన్నట్టు కాకుండా సినిమా గురించి ఆ సినిమా కలుగచేసే ఇంప్యాక్ట్ గురించి ఎలాంటి భేషజాలం లేకుండా బాలయ్య మాట్లాడిన తీరు అల్లు ఫ్యాన్స్ ని కూడా అలరిస్తుంది.

అల్లు ఫ్యామిలీతో ఇదివరకే మంచి రిలేషన్ ఉన్నా సరే బాలయ్య ఎప్పుడైతే అన్ స్టాపబుల్ షో చేస్తున్నాడో అప్పటినుంచి ఈ రెండు ఫ్యామిలీల మధ్య ఇంకాస్త బంధం బలపడ్డది. ఆహా అన్ స్టాపబుల్ షోలో బాలయ్య తన ఎనర్జీతో ఏ టాక్ షోకి రానంటువంటి రికార్డ్ వ్యూస్ రాబడుతున్నాడు. మొత్తానికి ఇండస్ట్రీలో ఈ కొత్త ఉత్సాహం చాలా బాగుంది.

అల్లు హీరో సినిమాకు నందమూరి హీరో అదికూడా బాలయ్య వచ్చి విష్ చేయడం చాలా మంచి విషయం. ఇలానే సినీ పెద్దలంతా సినిమా కోసం చేతులు కలిపితే చాలు ఇండస్ట్రీ మరింత ముందుకెళ్తుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.