Begin typing your search above and press return to search.
ఆ విషయం నాకు గర్వకారణం : బాలయ్య
By: Tupaki Desk | 22 Dec 2018 6:31 AM GMTఒక తండ్రి బయోపిక్ ను ఒక కొడుకు నిర్మించడం గొప్ప విషయం, ఇక ఆ తండ్రి పాత్రలో కొడుకు నటించడం అనేది చాలా అరుదైన విషయం. నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్’ ద్వారా ఈ అరుదైన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నాడు. ‘ఎన్టీఆర్’ మూవీని స్వయంగా నిర్మించడంతో పాటు ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషించాడనే విషయం తెల్సిందే. క్రిష్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
తాజాగా ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో నిర్వహించారు. నిమ్మకూరులో ఈ వేడుక నిర్వహించాలని భావించినా కూడా వాతావరణం అనుకూలించక పోవడంతో ఇక్కడ చేయాల్సి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బాలయ్య సుదీర్ఘంగా మాట్లాడాడు. దాదాపు అర్థగంటకు పైగా మాట్లాడిన బాలయ్య పలు విషయాల గురించి స్పందించాడు. ఆ సమయంలోనే తన తండ్రి ఎన్టీఆర్ చేయని నారధుడు మరియు గౌతమిపుత్ర శాతకర్ణి పాత్రలను నేను చేయడం చాలా గర్వంగా ఉందని, ఆయన చేయని పాత్రలు నేను చేశానంటూ చెప్పుకోవడం గొప్ప విషయంగా భావిస్తున్నాను అన్నాడు.
ఇక ఆయన పాత్రను నేను పోషించడం జీవితంలోనే పెద్ద విషయం. మనం బలంగా సంకల్పించుకుంటే పంచ భూతాలు ఏకం అయ్యి ఆ కార్యంను జరిపిస్తాయి, ఎన్టీఆర్ మూవీ కూడా అలాగే అయ్యిందని అన్నాడు. ఈ సినిమా హిట్ అవ్వాలిని ఎంతో మంది అంటున్నారు. కాని నేను మాత్రం ఈ సినిమా నిలిచి పోతుందని అనుకుంటున్నాను అన్నాడు.
ఇది సినిమా ప్రారంభోత్సవ వేడుక అన్నట్లుగా అనిపిస్తుంది, పాటల వేడుకా అంటే నమ్మశక్యం కావడం లేదు. మొన్ననే సినిమా ప్రారంభం అయ్యిందనిపిస్తుంది. ఈ సినిమా కోసం 89 రోజులు పని చేశాం. ఇంత తక్కువ సమయంలో ఇన్ని పాత్రలు, ఇన్ని గెటప్ లు, ఇంత మంది స్టార్స్ తో సినిమా పూర్తి చేశాం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది.
ఈ సినిమాను ఆయన జీవిత సారాంశంను తీసుకుని తెరకెక్కించాం. గాంధీ సినిమా నుండి మహానటి వరకు ఎన్నో బయోపిక్ లు తీసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రం యావత్ భారతదేశం చూడాల్సిన సినిమా. అందుకే పలు భాషల్లో డబ్బింగ్ చేయబోతున్నాం.
రౌడీ ఇన్సిపెక్టర్ సమయంలో సొంత బ్యానర్ పెట్టి సినిమా తీయాలనుకున్నా, అప్పటి నుండి కూడా ఏదో కారణంగా కుదరలేదు. అది ఇన్నాళ్లకు కుదిరింది. ఈ సినిమా తీయడం కోసమే నా బ్యానర్ ఆలస్యం అయ్యిందేమో. నా కోరికలన్నీ ఈ చిత్రంతో తీర్చుకున్నాను. ఈ సినిమాను వ్యాపారం కోసం చేయలేదు. ఒక మంచి సినిమాను తీశామన్న సంతృప్తి పూర్తిగా ఉంది. దర్శకుడు క్రిష్ కు నా ఆలోచన ఏంటో తెలుసు, నా ఆలోచనలో రామారావు గారు ఎలా ఉంటాడో అలాగే ఈ చిత్రంలో చూపించారు.
విద్యాబాలన్ గారు అమ్మ పాత్రలో నటించారు. ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకు అమ్మ పాత్రను చేసేందుకు ఆమె ముందుకు రావడం మా అదృష్టం అన్నాడు.