Begin typing your search above and press return to search.
'బనారస్' ట్రైలర్.. ఓటీటీ కంటెంట్ అనిపిస్తుందే..!
By: Tupaki Desk | 27 Sep 2022 5:39 AM GMTకర్నాటక పొలిటిషియన్ జమీర్ అహ్మద్ ఖాన్ తనయుడు జైద్ ఖాన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా "బనాసర్". జయతీర్థ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సోనాల్ మోంటెరో హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని విడుదకు సిద్ధం చేస్తున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ సోమవారం 'బనారస్' ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఇది వారణాసి నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. అయితే రెగ్యులర్ లవ్ స్టోరీగా కాకుండా.. దీనికి టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ జోడించారు. హీరో టైం లూప్ లో చిక్కుకున్నాడని అర్థమవుతుంది
సోనాల్ ప్రాణానికి ప్రమాదం పొంచి ఉండగా.. జైద్ ఆమెను రక్షించడానికి తన శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నాడని స్పష్టమవుతోంది. అయితే హీరో టైం లూప్ లో ఎలా ఇరుక్కున్నాడు? దాన్నుంచి ఎలా బయటపడ్డాడు? హీరోయిన్ ని కాపాడుకున్నాడా లేదా? అనేది సినిమా కథాంశామని తెలుస్తుంది.
అయితే 'బనారస్' ట్రైలర్ పెద్దగా ఆకట్టుకోలేదనే కామెంట్స్ వస్తున్నాయి. టైం ట్రావెల్ కోణాన్ని టచ్ చేయనప్పటికీ.. ఉత్కంఠ భరితంగా కట్ చేయలేదని చెప్పాలి. అంతేకాదు ట్రైలర్ చూసిన వెంటనే ఓటీటీ కంటెంట్ అనే భావన కలిగిస్తోంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఏమంత గొప్పగా లేవనిపిస్తుంది.
'బనారస్' చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కన్నడలో రూపొందిన ఈ సినిమాని తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు.
కానీ ఇప్పుడు వచ్చిన బనారస్ ట్రైలర్ ఆడియన్స్ ని పెద్దగా అట్రాక్ట్ చేయలేకపోయింది. నిరుత్సాహ పరిచిందనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పటి వరకూ రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కూడా బజ్ క్రియేట్ చేయలేకపోయింది. మరి తెలుగు సినిమాలతో పోటీ పడి.. ఈ కన్నడ డబ్బింగ్ మూవీ థియేటర్లలో ఈ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి.
కాగా, 'బనారస్' చిత్రాన్ని NK (నేషనల్ ఖాన్స్) ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో తిలక్ రాజ్ భల్లాల్ నిర్మించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం సమకూర్చగా.. అద్వైత గురుమూర్తి సినిమాటోగ్రఫీ నిర్వహించారు. కేఎమ్ ప్రకాష్ ఎడిటింగ్ వర్క్ చేశారు.
నారాయణ రాజ్ - సుజయ్ శాస్త్రి - దేవరాజ్ - అచ్యుత్ కుమార్ - బర్కత్ అలీ - సప్నా రాజ్ తదితరులు ఈ సినిమాలో ఇతర పాత్రలు పోషించారు. 'బనారస్' మూవీ 2022 నవంబర్ 4వ తేదీన రిలీజ్ కాబోతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.