Begin typing your search above and press return to search.
ఆ రోజు మిస్ అయితే.. బండ్ల గణేశ్ చనిపోయి ఉండేవారట
By: Tupaki Desk | 25 Aug 2021 4:30 AM GMTసినిమా ఇండస్ట్రీలో నిర్మాతలకు ఉండే విలువ.. గౌరవం లాంటివి ఇప్పుడు పెద్దగా లేవనే చెప్పాలి. ఒకప్పుడు చిత్ర నిర్మాత అంటే.. ఎంత పెద్ద నటుడైనా సరే.. సినిమా నిర్మాత అంటే బోలెడంత భయం.. అంతకు మించిన భక్తితో ఉండేవారు. నిర్మాత కెప్టెన్ ఆఫ్ ద షిప్ గా నడిచిన రోజులు చాలానే ఉన్నాయి. ఆ తర్వాతి కాలంలో నిర్మాతలకు ఇండస్ట్రీలో పెద్దగా భయం.. భక్తి మాత్రమే కాదు.. గౌరవ మర్యాదలు అంతకంతకూ ఎక్కేవే. గతాన్ని కాసేపు పక్కన పెట్టేసి.. ఇటీవల కాలంలో నిర్మాతలు ఏదైనా భిన్నంగా వ్యవహరిస్తున్నారంటే..అలాంటి వారు చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తారు.
దిల్ రాజును ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీని నటీనటులు ఏలేస్తున్న వేళ.. నిర్మాతకు ఐడెంటిని తెచ్చి పెట్టిన నిర్మాతగా తెలుగు ప్రజలకు గుర్తుండిపోతారు. అంతే కాదు.. సినిమాను అత్యంత క్రమశిక్షణతో తీయటం.. దాన్ని అంతే జాగ్రత్తగా మార్కెట్లోకి తీసుకురావటం లాంటి కష్టాల్ని అలవోకగా అధిగమిస్తూ.. నిర్మాత అంటే ఇంత ఎనర్జటిక్ గా ఉండాలన్న అభిలాషను ఇప్పుడు ప్రత్యక్షంగా చేసి చూపిస్తున్నారు. దిల్ రాజు తీరు ఇలా ఉంటే. ఇండస్ట్రీకి చెందిన నిర్మాత కమ్ నటుడు తీరు రోటీన్ కు కాస్త భిన్నమని చెబుతారు.
అలాంటి ఆయన తాజాగా కరోనా నుంచి విజయవంతంగా బయటపడటం తెలిసిందే. తనకు కరోనా వచ్చినప్పుడు ఏం జరిగిందో వెల్లడించారు. బండ్ల గణేశ్ మాటల్లోనే చెప్పాల్సి వస్తే..
‘‘కొన్ని నెలల క్రితం రెండోసారి నాకు కరోనా సోకింది. నా భార్య, బిడ్డ ఇలా ఇంటిల్లిపాదీ కరోనాతో సతమతమయ్యాం. నా ఊపిరితిత్తులు 60 శాతానికి ఫైగా ఇన్‌ఫెక్ట్ అయ్యాయి. పెద్ద పెద్ద ఆసుపత్రులన్నింటికీ ఫోన్ చేశా. ఎవరూ బెడ్స్ లేవన్నారు. అపోలో ఆసుపత్రికి చేస్తే సుబ్బారెడ్డి ‘సారీ’ అన్నారు’’ అని చెప్పారన్నారు.
‘‘ఆ టైంలో తాను పవన్ కల్యాణ్‌గారికి చేద్దామంటే.. ఆయన కూడా కరోనాతో బాధపడుతున్నారని. చివరి ప్రయత్నంగా చిరంజీవిగారికి చేశా. ఒక్క రింగ్‌కే ఫోన్ ఎత్తి ‘చెప్పు గణేశ్’ అన్నారు. నా సమస్య చెప్పాను. ఆయన కాసేపు మాట్లాడలేకపోయారు. ఫోన్ పెట్టేసి ఆయన చేసే పని ఆయన చేశారు. నాకు బెడ్ దొరికింది. కొద్ది రోజులు ఇబ్బంది పడినా ఆరోగ్యంగా తయారయ్యాను. ఆస్పత్రిలో చేరడం ఒక్క రోజు ఆలస్యమైనా నేను చనిపోయేవాడినని డాక్టర్లు చెప్పారు. అదే జరిగితే ఈ రోజు ఇలా మాట్లాడగలిగేవాడిని కాదు. ఇదంతా చిరంజీవిగారి చలవే! నాకు ప్రాణం పోసిన ఆయన రుణం తీర్చుకోలేనిది’’ అని భావోద్వేగంతో స్పందించారు. ఇదంతా విన్నప్పుడు బండ్ల గణేశ్ లాంటి వారికే బెడ్లు దొరకలేదన్న వేళ.. సామాన్యులు మరెంత ఇబ్బందులకు గురయ్యారన్న విషయాన్ని తలుచుకుంటే వణుకు పుట్టాల్సిందే.