Begin typing your search above and press return to search.
గబ్బర్ సింగ్.. ప్రొడ్యూసర్ అప్సెట్
By: Tupaki Desk | 22 March 2016 7:30 AM GMTసర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు పక్క పక్కనే కనిపించి, అభిమానులకు కనువిందు చేశారు. ఈ ఫంక్షన్ చాలామందికి సంతోషం ఇచ్చిందని చెప్పాలి. కానీ కొంతమంది మాత్రం ఫీలవుతున్నారన్న మాట ఒప్పుకోవాల్సిందే. సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ.. నాలుగేళ్ల క్రితం వచ్చిన గబ్బర్ సింగ్ కు నెక్ట్స్ జనరేషన్. సీక్వెల్ కాదు కానీ.. అదే కేరక్టర్ తో వేరే స్టోరీ.
అలాంటప్పుడు గబ్బర్ సింగ్ దర్శక - నిర్మాతలను ఆహ్వానించాల్సింది అనే టాక్ వినిపిస్తోంది. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్.. ఈ విషయంలో కొంచెం బాధ పడ్డా.. తర్వాత ఓ ట్వీట్ పెట్టాడు. 'ఆయన సినిమాలు రిపీటెడ్ గా చూసి ఎదిగిన నాకు ఇంతకన్నా ఏం కావాలి, మెగాస్టార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు' అని హరీష్ శంకర్ ట్వీట్ చేశాడు. 'పేరు గుర్తుందిగా.. గబ్బర్ సింగ్.. సర్దార్ గబ్బర్ సింగ్..' ఈ డైలాగ్ ఉన్నందుకు హ్యాపీగా ఫీలవుతున్నట్లు చెప్పాడు.
అయితే గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ లెక్క మాత్రం వేరేగా ఉంది. గతంలో సర్దార్ హిందీలో కూడా రిలీజ్ అవుతోందంటూ ఓ ట్వీట్ పెట్టిన బండ్ల.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు. ఆడియో ఫంక్షన్ సందర్భంగా పవన్ ను విష్ చేయడం కానీ, ట్రైలర్ ను షేర్ చేయడం కాని, చిరు-పవన్ ల కలయికపై కామెంట్ చేయడం కానీ.. ఇలా దేనిపైనా బండ్ల నుంచి రెస్పాన్స్ రాలేదు. అంతగా అప్ సెట్ అయ్యాడు బండ్ల గణేష్.