Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కు సారీ చెప్పిన బండ్ల గణేష్

By:  Tupaki Desk   |   28 Jan 2017 10:08 AM GMT
ఎన్టీఆర్ కు సారీ చెప్పిన బండ్ల గణేష్
X
మెగా ఫ్యామిలీ హీరోలతో బండ్ల గణేష్ చాలా క్లోజ్. అయినప్పటికీ నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ తో రెండు సినిమాలు చేశాడు. అయితే ఎక్కడ తేడా కొట్టిందో కానీ.. ఎన్టీఆర్ తో బండ్లకు చెడింది. ఓ సందర్భంలో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కూడా మాట్లాడాడు బండ్ల. ఐతే తాను అప్పుడు తప్పు చేశానని అన్నాడు బండ్ల. ఈ విషయంలో ఎన్టీఆర్ కు.. అతడి అభిమానులకు బహిరంగ క్షమాపణ కూడా చెప్పాడు. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బండ్ల ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘‘అప్పట్లో ఒక టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తో నాకు ఒక సమస్య వచ్చిందని చెప్పాను. కొంచెం కోపంగా స్పందించాను. కానీ ఎన్టీఆర్ అంటే మా నాన్నకు చాలా చాలా ఇష్టం. ఎన్టీఆర్ ను చూసి ఏం హీరోరా అంటుంటాడు. అందుకే అప్పట్లో నేను చేసిన కామెంట్ల విషయంలో చాలా బాధ పడుతున్నా. నేను అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఈ విషయంలో ఎన్టీఆర్ కు.. ఆయన అభిమానులకు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నా’’ అని బండ్ల గణేష్ వ్యాఖ్యానించాడు.

ఎన్టీఆర్ తో చేసిన ‘బాద్ షా’ సినిమాతో తనకు నష్టం వచ్చిందని.. ఐతే ‘టెంపర్’ సినిమాతో మాత్రం మంచి లాభాలు అందుకున్నానని బండ్ల తెలిపాడు. ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అని.. తన బేనర్లో రెండు సినిమాలు చేశాడని.. మున్ముందు ఆయనతో మరిన్ని సినిమాలు తీయాలనుకుంటున్నానని బండ్ల వ్యాఖ్యానించాడు. మరి అందుకు ఎన్టీఆర్ ఒప్పుకుంటాడేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/