Begin typing your search above and press return to search.

అవి నంది అవార్డులు కాదు.. సైకిల్ అవార్డులు

By:  Tupaki Desk   |   16 Nov 2017 4:21 AM GMT
అవి నంది అవార్డులు కాదు.. సైకిల్ అవార్డులు
X
ఉత్తమ చిత్రాలకు.. నటులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే నంది అవార్డులను వివాదాలు చుట్టుముట్టడం కొత్తేమీ కాదు. అవార్డుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని ఎప్పుడూ ఒకరిద్దరు ఫీలవుతూనే ఉంటారు. కానీ ఈసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లకు ఒకేసారి నంది అవార్డులను ప్రకటించడం.. వాటిలో నందమూరి ఫ్యామిలీకే ఎక్కువ అవార్డులు దక్కడంతో మెగా ఫ్యామిలీని కావాలనే సైడ్ చేశారనే విమర్శలు మొదలయ్యాయి.

ఇదే ఇష్యూపై ఓ టీవీ ఛానల్ నిర్వహించిన డిస్కషన్ లో మెగా ఫ్యామిలీ వీరాభిమాని బండ్ల గణేష్ గట్టి కౌంటరే వేశాడు. ఈసారి ఇచ్చింది నంది అవార్డులు కాదని.. అవి సైకిల్ అవార్డులని పంచ్ వేశాడు. అవార్డుల విషయంలో కావాలని మెగా ఫ్యామిలీకి అన్యాయం చేస్తున్నారని.. ఇది మొదటి నుంచే ఉన్నదేనని గణేష్ ఫైరయ్యాడు. ‘‘ఎండాకాలం ఎండ కాస్తుంది.. వానాకాలం వానలు పడతాయి.. శీతాకాలం చలేస్తుంది.. అలాగే ఇది టీడీపీ కాలం. వాళ్లేం చెబితే అది వినాలి. లేదా ఇంకో కాలం వచ్చేదాకా వెయిట్ చేయాలంటూ’’ సెటైర్ వేశాడు.

బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించిన గోవిందుడు అందరివాడే సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రం వస్తుందని ఆశించానని.. చరణ్ కు కచ్చితంగా అవార్డు వస్తుందని అనుకున్నానని బండ్ల గణేష్ చెప్పుకొచ్చాడు. కానీ కంటితుడుపుగా ఓ అవార్డు ఇచ్చి సరిపెట్టేశారని ఫీలయ్యాడు. మిగతా విషయాలెలా ఉన్నా ఈసారి ఇచ్చింది సైకిల్ అవార్డులనే పంచ్ మాత్రం డిస్కషన్ లో పాల్గొన్నవారందరికీ గట్టిగానే తగిలింది.