Begin typing your search above and press return to search.
'గబ్బర్ సింగ్' ప్రొడ్యూసర్ లో ఈ మార్పుకి కారణమేంటి...?
By: Tupaki Desk | 27 July 2020 2:30 AM GMT'గబ్బర్ సింగ్' దర్శక నిర్మాతలు హరీష్ శంకర్ - బండ్ల గణేష్ మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 'గబ్బర్ సింగ్' విడుదలై 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఆ సినిమాకు పని చేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్తూ హరీష్ శంకర్ ట్విటర్ లో ఓ లేఖను విడుదల చేసారు. అయితే నిర్మాత బండ్ల గణేష్ పేరు ప్రస్తావించలేదు హరీష్. తర్వాత విషయాన్ని గ్రహించిన హరీష్ మళ్ళీ బండ్ల గణేష్ కి థ్యాంక్స్ చెప్తూ మరో ట్వీట్ చేశారు. ఈ విషయంపై బండ్ల గణేష్ మనస్తాపానికి గురై హరీష్ శంకర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. అప్పటి నుండి ఈ వివాదం కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
అయితే ఇటీవల కరోనాని జయించిన బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ''అన్నదమ్ముల మధ్య అప్పుడప్పుడు వచ్చే చిన్న గొడవ లాంటిది. ఆయన మంచి డైరెక్టర్. అంత పెద్ద డైరెక్టర్ అవకాశం ఇస్తే సినిమా ఎందుకు చేయను. ఆ రోజేదో కోపంలో అలా అనేశాను. అప్పుడప్పుడు ఇంట్లో పిల్లల మీద భార్య మీద కూడా కోప్పడుతుంటా. తల్లి మీద కూడా అలిగి రెండు రోజులు మాట్లాడకుండా ఉంటాం. అంత మాత్రాన వారు మనవాళ్ళు కాకుండా పోతారా? అన్నదమ్ముల్లాంటోల్లం ఏదో కోపంలో అరుచుకున్నాం'' అని చెప్పుకొచ్చారు. దీనికి హరీష్ శంకర్ స్పందిస్తూ ''నేను ఎప్పుడూ బండ్ల గణేష్ ని గౌరవిస్తాను.. గబ్బర్ సింగ్ కోసం మాత్రమే కాదు. మిరపకాయ్ కంటే ముందు కూడా అతను నాతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.. అతను త్వరగా కోలుకున్నందుకు హ్యాపీ'' అని ట్వీట్ చేశారు.
ఇప్పుడు తాజాగా బండ్ల గణేష్ మరోసారి హరీష్ శంకర్ కాల్ చేసి మాట్లాడారని ట్విటర్ లో పేర్కొన్నారు. ''హరీష్.. నీ కన్సర్న్ కి ధన్యవాదాలు బ్రదర్. నీ కాల్ తర్వాత నిజంగా సంతోషంగా ఉంది. ఈ చిన్న జీవితంలో గొడవలు వద్దు.. శత్రువులు వద్దు'' అని ట్వీట్ చేసారు బండ్ల గణేష్. మొత్తం మీద ఒకప్పుడు ఆవేశంగా అన్ని విషయాలపై స్పందిస్తూ ఉండే బండ్ల గణేష్ ఇప్పుడు సౌమ్యంగా మాట్లాడుతూ ఈ చిన్న జీవితంలో గొడవలు పడి శత్రువులను తయారు చేసుకోవద్దంటూ శాంతిని కోరుకుంటున్నాడని అర్థం అవుతోంది. రోడ్డుపై యాక్సిడెంట్ అయి పడిపోయిన వ్యక్తికి హెల్ప్ చేసి సేవా గుణాన్ని చాటుకున్నాడు. ఈ మధ్య ఇంటర్వ్యూలలో కూడా ఇంతకముందు గొడవపడిన ఎమ్మెల్యే రోజా నా సిస్టర్ అని.. పీవీపీ బాగుండాలని కోరుకుంటున్నాని చెప్పుకొచ్చాడు. 'పవర్ స్టార్' సినిమాలో తనని పోలిన పాత్రని క్రియేట్ చేసిన వర్మ పట్ల కూడా బండ్ల గణేష్ సౌమ్యంగానే వ్యవహరించారు. అయితే కరోనా నుంచి బయటపడిన తర్వాత బండ్లన్న లో చాలా మార్పు వచ్చిందని ఆయన ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.