Begin typing your search above and press return to search.
కృష్ణ వంశీని పేరు పెట్టి ఎప్పుడు తిట్టాను?
By: Tupaki Desk | 1 March 2017 6:15 AM GMTతన మాటలతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిన నటుడు.. నిర్మాత బండ్ల గణేశ్ చెబుతున్న బోల్డ్ మాటలు ఇప్పుడు హాట్.. హాట్ గా మారాయి. ఈ మధ్యన అతడిస్తున్న ఇంటర్వ్యూల పరంపరలో అడిగేవాడు అడగాలే కానీ.. చెలరేగిపోతూ చెబుతున్న వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల ఒక ప్రముఖమీడియా సంస్థ అధినేత చేసిన ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడేసిన బండ్ల గణేశ్.. కొన్ని ఇబ్బందికర ప్రశ్నలకు సమాధానం చెప్పనప్పటికీ.. చెప్పాల్సిన రీతిలో చెప్పేసిన వైనం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
కొరటాల శివతో బండ్ల గణేశ్ కు విభేదాలన్న మాటను ఏ మాత్రం ఒప్పుకోని ఆయన.. తనకూ.. కొరటాల శివకు మధ్య విభేదాలు అస్సలు లేవని.. అతను చాలా మంచివాడని.. అతనితో తనకెప్పుడు విభేదాలు రాలేదని చెప్పుకొచ్చారు. ‘శివ అనే వాడు అస్సలు కాంట్రావర్సీ లేని వ్యక్తి’’ అని.. ఆయన డైరెక్షన్ లో చరణ్ తో సినిమా స్టార్ట్ చేసినా.. రకరకాల కారణాలతో సినిమా ఆగిందని.. అంతే తప్ప అతడితో అస్సలు విభేదాలు లేవని.. ఇప్పటికి ఆయనతో తాను టచ్ లో ఉన్నానని.. అతడితో టూ హండ్రెడ్ పర్సంట్ సినిమా చేయనున్నట్లు తేల్చేశారు బండ్ల గణేశ్.
కృష్ణవంశీ గురించి ఎందుకు పరుషంగా మాట్లాడావ్.. అందరూ ఆయన గురించి సాఫ్ట్ అని చెబుతుంటారు.. గణేశ్ దృష్టిలో కృష్ణవంశీ సాఫ్ట్ కాదు.. ఎందుకని తిట్టా..? అని ప్రశ్నించినప్పుడు.. ‘‘పేరు పెట్టి ఎక్కడ తిట్టా సార్..’’ అంటే.. ‘‘పేరు అక్కర్లేదు.. పేరు లేకుండా తిట్టావుగా..’’ అని ఇంటర్వ్యూ చేసిన ఆయన అన్నప్పుడు.. ‘‘(ముఖంలో ఫీలింగ్స్ మార్చేసి.. ఇంకేంటి సార్ కబుర్లు.. వేరే టాపిక్ మాట్లాడుకుందాం గురువుగారు. ఇంకేం కబుర్లు’’ అంటూ పెద్దగా నవ్వేశారు గణేశ్.
దీనికి రియాక్ట్ అయిన ఇంటర్వ్యూ చేసిన మీడియా సంస్థ అధిపతి.. ‘‘బాగా ముదిరిపోయావ్’’ అనగా.. ‘నేనెక్కడ ముదిరిపోయాను సార్.. ముదిరిపోయినట్లు యాక్ట్ చేస్తా’’ అని బదులిచ్చారు. ‘ముదరకపోతే.. నువ్వు వచ్చిన నేపథ్యం.. తీసిన సినిమాలు..ఇవన్నీ చూస్తే.. మహా ముదురు అయితే తప్ప ఇవన్నీ సాధ్యం కాదు’’ అన్నప్పుడు.. దానికి ప్రతిగా గణేశ్.. ‘దీన్ని కాంప్లిమెంట్ అనుకోమంటారా గురువుగారు?’’ అనగా.. అంతేగా అన్న ఆయన మాటకు.. ‘మనసులో కాంప్లిమెంటే అని ఉంది. మీ ద్వారా ఓ అనిపించుకుంటే జనం చూస్తారు కదా. శంఖంలో పోస్తే తీర్థమైనట్లు.. మీ నోటి గుండా అనిపించుకుంటే బాగుంటుంది కదా’’ అంటూ తనకు మాత్రమే సాధ్యమైన మాటల్ని చెప్పేశారు బండ్ల గణేశ్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/