Begin typing your search above and press return to search.
బండ్ల మాట: గాడ్ మేడ్ ఏ రేర్ పీస్.. అదే పవన్
By: Tupaki Desk | 28 Jan 2017 9:30 AM GMTనటుడిగా సుపరిచితుడు.. నిర్మాతగా అందరి నోళ్లలలోనానినోడు.. బడా హీరోలతో వరుసగా ఇంటర్వ్యూలు చేసేసి టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారినోడు.. ఇన్ కం ట్యాక్స్ దాడులతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చినోడు.. ఇలా చెప్పుకుంటూ పోతే బండ్ల గణేశ్ గురించి చాలానే చెప్పాల్సి వస్తుంది. ఫ్రాంక్ గా మాట్లాడటంతో పాటు.. భావోద్వేగంతో ఊగిపోయి నచ్చినోళ్లను ఆకాశానికి ఎత్తేసే అలవాటున్నబండ్ల తాజాగా ఒక ఇంటర్య్వూ ఇచ్చారు. మొహమాటం లేకుండా అన్ని నిజాలే మాట్లాడతానని చెప్పినోడు.. అదే తీరులో మాట్లాడి సంచలనం సృష్టించారు. ఇంతకీ ఆయన చెప్పిన మాటలు.. ఆసక్తికర విషయాలు చూస్తే..
-పవన్ అంటే ఎందుకు పిచ్చి? పవన్ కల్యాణ్ వ్యక్తిగత విషయాలు సాల్వ్చేసినందుకే మీకు అవకాశం ఇచ్చారన్నటాక్ ఉంది దానికేమంటారు..?
‘‘మగాళ్లు ఇంతమంది ఉన్నా మనకు మన నాన్నంటే ఎందుకు ఇష్టం. దేశంలో ఇంతమంది మగాళ్లు ఉన్నా తండ్రి మీద ఎందుకు అభిమానం ఉంటుంది? నాకు నిర్మాతగా జన్మనిచ్చాడు. నాకు అండగా నిలిచారు.నాన్న మీద కోపం వస్తుంది. నాన్న దూరం రాదుగా. నాన్న మీద ప్రేమ ఉందికదా అని బాబాయ్.. అన్నల మీద ప్రేమ ఉండకుండా ఉండదు కదా. పవన్ కు సాయం చేయటమా?.. ఛీ..ఛీ.. ఆయనకు ఎవరు చేయాలి సార్? దేవుడు కూడా చేయలేడు సార్. ఆయనకు ఆయనే చేసుకుంటాడు. ఆయనకు సంస్కారం ఎక్కువ. అది రేర్ పీస్.గాడ్ మేక్ ఎ రేర్ పీస్.. అది పవన్ కల్యాణ్’’
‘‘పవన్ కల్యాణ్ అనే వ్యక్తి అతీతమైన శక్తి. అవతల వాడి స్థాయి చూసి స్నేహం చేయడు. అవతలవాడి టాలెంట్ చూసి.. వాడి క్యారెక్టర్ చూసి నిమిషంలో స్కాన్ చేస్తాడు. డబ్బులు ఉందా? లేదా?అన్నది అస్సలు చూడడు. కొమరం పులి సినిమా చేసే దాకా నాకుతెలీదు. నన్నుపిలిచి.. సినిమా చేస్తానని చెప్పాడు. సుస్వాగతం నుంచి కలిసి చేశాను. పవన్ వ్యక్తిగత విషయాలు ఏదో సాల్వ్ చేశాడన్న మాట అబద్ధం. ఇండస్ట్రీలో 30 ఏళ్ల నుంచి వేషాలు వేస్తే.. పని పాటా లేకుండా కొంతమంది ఉంటారు. అలాంటోళ్లు చేసే ప్రచారమే ఇది’’
‘‘పవన్ కల్యాణ్ అంటే నిజాయితీ. నా కోరిక. ఆయనకు నిజాయితీ ఉంది. ఆయన ప్రతిమాటా నిజాయితీనే. ఆయన నిజాయితీకి దేవుడు ఆయన్ను ముఖ్యమంత్రిని చేస్తారు. ఆయన సీఎం అయితే.. అది ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం’’
-పవన్ లో షార్ట్ టెంపర్.. ఆవేశపరుడన్న పేరు?
‘‘ఆవేశపడేవాడు చెడ్డోడా? ఆవేశపరుడు మంచినిర్ణయాలు తీసుకోకూడదా? జీవితంలో ఆవేశం లేనోడు పైకి రాలేడు సార్. ఆలోచించే వాడు.. జీవితాంతం ఆలోచిస్తూనే ఉంటాడు. వాడి జీవితం మొత్తం ఆలోచిస్తూ గడిపేస్తాడు. నచ్చితే నచ్చనట్లు ఉంటాడు. వెళ్లిపోండయ్యా అంటాడు’’
-పవన్ మూడో కన్ను తెరిస్తే..
‘‘రూంలోకి పిలిచి.. తిట్టేస్తాడు. ఆ పనిచేయలేదు.. ఈ పని చేయలేదని తిట్టేస్తారు. అందరి ముందు గణేష్ అంటారు. విడిగా ఉన్నప్పుడు మాత్రం అరేయ్ అంటారు’’
-పవన్ కల్యాణ్ లాంటి సెన్సిటివ్ వ్యక్తి రాజకీయాల్లోకి పనికి రాడంటారు? నిజమేనా?
‘‘నిజమే. ఆయన రాజకీయాలకు పనికి రాడు. ఎందుకంటే ఆయన అవినీతి చేయడు. ప్రాజెక్టులు కట్టి డబ్బులు దోచుకోవటం రాదు ఆయనకు. స్కాంలుచేయటం రాదు. స్కీంలు చేయటం రాదు. జనాల్ని మోసం చేయటం రాదు. ఆయనకు తెలిసింది ఒక్కటే.. ప్రజలకు సేవ చేయటం మాత్రమే తెలుసు. ఇప్పుడు మీరే చెప్పాలి.. ఆయన రాజకీయాలకు పనికి వస్తాడా? రాడా? అని.
-హీరోలకు ఫిట్టింగ్ లు పెడతారంటారు?
‘‘హీరోలు మేధావులు. వాళ్లు దేశ ముదుర్లు. హీరోల మధ్య ఫిట్టింగ్ లు పెట్టే పరిస్థితి ఉండదు. ఒక కథ విని..ఎంపిక చేసుకొని.. దాన్ని సినిమా తీయటం.. హిట్ కావటం అంటే.. అది మామూలు విషయం కాదు. కథ విని స్కాన్ చేసేస్తారు. రవితేజకు ఏం చరిత్ర ఉంది. రవితేజతో పాటువచ్చినోళ్లు ఈ రోజుకి వేషాలు అడుక్కుంటున్నారు’’
-సచిన్ జోషి. ఆయనతో ఆఫికీ 2 రీమేక్ చేశారు. ఆయనతో మీకు వచ్చినవిభేదాలేంటి?
‘‘నా జీవితంలో నాకు తెలిసి నేను ఏమైనా తప్పు చేసింది ఉందంటే అదొక్కటే. నాకు సచిన్ తో పరిచయం లేదు. నేను చెప్పాను కదా నాకు హమీద్ భాయ్ అని ఫ్రెండ్ఉన్నాడని చెప్పాను కదా.. ఆయన పిలిచి సచిన్ తో సినిమా చేయమన్నాడు. ఓకే అన్నాడు. హమీద్ భాయ్ అంటే నాకు మంచిఫ్రెండ్. అలాంటి వ్యక్తి అడగటంతో ఓకే అన్నా. సినిమా చేశా. నాజీవితంలో ఏదైనా లాస్ వస్తుందంటే.. ఆ వీధిలో నడవను. లాభం వస్తే వీధి పది కిలోమీటర్లదూరంలో ఉంటే.. అక్కడికి వెళతా. బండ్ల గణేశ్ లాంటోడు సచిన్ జోషితో సినిమా తీస్తాడా? అని చెబితే నమ్ముతాడా? ఆయన డబ్బులు పెట్టుకున్నాడు. చేసుకున్నాడు. ఆ సినిమాలో లాస్ వచ్చింది. నువ్వు తీశావన్నాడు. నేను తీయలేదని చెప్పాడు. నా ప్రాణం పోయినా డబ్బులు పెట్టా. కోర్టుకు వెళ్లాడు.. పిచ్చి పిచ్చి ట్వీట్స్ చేశాడు. పరువునష్టం దావా వేశా. సీయూ ఇన్ జైల్ అన్నాడు. వాళ్లకు.. వాళ్ల నాయనకు అలవాటు. మాకు అలాంటి అలవాట్లు లేవు. సినిమాలు తీస్తే లాభం వస్తుంది సార్.కానీ.. సచిన్ జోషితో సినిమా తీస్తే.. అంత పిచ్చోడ్నా బండ్ల గణేశ్ అనేటోడు. అమిత్ భాయ్ కోసం సినిమా తీశా’’
-ఒక సమయంలో ఆయన నయింతో చెప్పించి.. మీ చేత డబ్బులు వసూలు చేయించాడని..?
‘‘అది అబద్ధం. నన్ను చాలా తక్కువగా అంచనా వేసుకుంటున్నారు. బండ్ల గణేశ్ అంటే రెండో యాంగిల్ మీకు ఎవరికి తెలీదు. నాకు నయింలు.. బయింలు అవసరం లేదు.మా ఊళ్లో మేం శాసిస్తాం. మా మీద ఈగ వాలదంతే. మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరంతే. హైదరాబాద్లో కాదు ఎక్కడైనా మమ్మల్నిటచ్ చేయలేరు.నా మీద ఈగ కూడా వాలదు’’
-ఏంటి మీకంత నమ్మకం?
‘‘ట్రంప్ దగ్గరకు పోయి వన్ వీక్ లో ఆయనతో దిగిన ఫోటో మీకు ఇవ్వమంటారా? నా స్థాయి.. నా స్టామినా అది.
సచిన్ జోషితో సినిమా తీయటమే. అషికి సినిమానుతెలుగులో రీమేక్ చేయటం
-బాస్ తో సినిమా అన్నారు ఎప్పుడు?
‘‘పవన్ కల్యాణ్ తో మళ్లీ సినిమాలు తీస్తా’’
-ఎన్టీఆర్ తో ఏంటి గొడవ?
‘‘ఎన్టీఆర్ చాలా గొప్ప వ్యక్తి. కొన్ని చెప్పుడు మాటల వల్ల నేను ఆ మనిషిని దూరం చేసుకున్నా. ఆయనకు.. ఆయన అభిమానులకు క్షమాపణ చెబుతున్నా. టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పుడు మాటలతో కాస్త తప్పుగా మాట్లాడా. ఇంటికి వచ్చాక మా నాన్న తిట్టారు.మళ్లీ మరోసారి చెబుతున్నా.. ఎన్టీఆర్ కు సారీ చెబుతున్నా’’
source : idream media