Begin typing your search above and press return to search.
ఓటీటీపై బండ్ల లాజిక్ భలే ఉందే..!
By: Tupaki Desk | 28 July 2020 1:30 AM GMTనటుడు నిర్మాత అయిన బండ్ల గణేష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఓటీటీపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. భవిష్యత్తు మొత్తం ఓటీటీదే అని రాబోయే రోజుల్లో థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసేందుకు జనాలు ఆసక్తి చూపించక పోవచ్చు అంటూ కొందరు అంటున్న నేపథ్యంలో బండ్ల గణేష్ వారి వాదన కొట్టి పారేశాడు. ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్లు లేక ఓటీటీ పై జనాలు ఆధారపడుతున్నారు కాని త్వరలోనే మళ్లీ థియేటర్లు మొదలైతే జనాలు క్యూ కట్టడం ఖాయం అన్నట్లుగా బండ్ల గణేష్ నమ్మకం వ్యక్తం చేశాడు.
నేనే కనుక ఒక సినిమా నిర్మించి విడుదలకు సిద్దంగా ఉన్నట్లయితే దానికి ఖచ్చితంగా ఓటీటీ విడుదలకు ఒప్పుకోను. కాస్త ఆలస్యం అయినా నష్టం వచ్చినా థియేటర్ లోనే విడుదల చేయాలనుకుంటాను. అసలు నాకు ఈ ఓటీటీ గీటీటీ ల గురించి పెద్దగా తెలియవు అంటూనే ఓటీటీ ల కంటే థియేటర్లకే ఎక్కువ ఆధరణ ఉంటుందని అన్నాడు. ఓటీటీలను ఇంట్లో దేవుళ్లతో థియేటర్లను దేవాలయాలతో బండ్ల పోల్చాడు.
ఇంట్లో ప్రతి రోజు దేవుళ్లకు దండం పెట్టుకుంటున్నాం కదా అని గుడికి వెళ్లడం మానేస్తామా. భక్తి ఉన్న వారు ఇంట్లో పూజించినా ఖచ్చితంగా గుడికి కూడా వెళ్తారు. అలాగే సినిమాలపై ఆసక్తి ఉన్న వారు ఖచ్చితంగా ఓటీటీలో చూసినా థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలని కోరుకుంటారంటూ లాజిక్ పాయింట్ ను బండ్ల రేజ్ చేశాడు. ఓటీటీ నడుస్తూనే థియేటర్లకు కూడా మళ్లీ కలకల వస్తుందని బండ్ల ఆశాభావం వ్యక్తం చేశారు.