Begin typing your search above and press return to search.
'ర్యాంపులు వ్యాంపులు వస్తుంటాయి పోతుంటాయి'.. బండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు..!
By: Tupaki Desk | 23 Jun 2022 7:30 AM GMTపూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా నటించిన తాజా చిత్రం "చోర్ బజార్". 'జార్జి రెడ్డి' ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందజేశారు.
ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ సతీమణి లావణ్య గురించి బండ్ల గణేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన తల్లిని ఎంత గౌరవిస్తానో లావణ్య ను కూడా అంతే గౌరవిస్తానని.. మనస్ఫూర్తిగా ఆమెకు పాదాభివందనాలు చేస్తున్నానని అన్నారు. ఎన్నో ర్యాంపులు వ్యాంపులు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ ఆమె మాత్రం కలకాలం ఉంటుంది బండ్ల పేర్కొన్నారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. "మా వదిన ఫోన్ చేసి ఈ సినిమా ఫంక్షన్ కు రావాలని కోరింది. వదిన అంటే నాకు ఎంతో ఇష్టం.. ఒక స్త్రీ జాతి గర్వపడాల్సిన తల్లిగా ఎలా ఉండాలంటే లావణ్య గారిలా ఉండాలని చెప్తాను. అమ్మ - అక్క - భార్య - కోడలు - కూతురు ఎలా ఉండాలి అంటే లావణ్య గారిలా ఉండాలి. సీతా దేవిని నేను చూడలేదు కానీ సీతా దేవికి ఉన్నంత ఓపిక ఉంది ఆవిడకి. ఆమెకున్నంత సహనం ఉందావిడకు. కర్ణుడికి జన్మనిచ్చిన కుంతీదేవికి ఉన్నంత గొప్ప క్వాలిటీస్ ఆమెలో ఉన్నాయి" అని అన్నారు.
"నేను నా తల్లిని ఎంత గౌరవిస్తానో నేను ఆవిడను అంత గౌరవిస్తా. నేను నిర్మాతగా పూరీ అన్నతో రెండు సినిమాలు చేసిన ప్రయాణంలో చాలావరకు మా వదినకు భాగం ఉంది. ఆమె గొప్ప వ్యక్తిత్వం గలది మహోన్నతమైనది. ఎన్నో ర్యాంపులు వ్యాంపులు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ అమ్మ (పూరీ సతీమణి ని ఉద్దేశిస్తూ) కలకాలం ఉంటుంది. జీవితాంతం ఆమెను గుండెల్లో పెట్టుకొని చూడాల్సిన బాధ్యత ఆకాష్ - పవిత్ర - పూరీ అన్నలకు ఉంది"
"మనస్ఫూర్తిగా ఆమెకు నా పాదాభివందనాలు చేస్తున్నా. ఎందుకంటే ఆవిడ అంటే అంత ఇష్టం నాకు. లవ్ యూ వదిన. నువ్ నా బంగారు తల్లివి. నాకు మా అమ్మ ఎంతో నువ్వు కూడా అంతే. నువ్ ఎప్పుడూ చల్లగా ఉండాలి. పూరీ పెద్ద డైరెక్టర్ అవుతాడు.. భూమ్ బద్దలు కొడతాడు.. ఇండస్ట్రీని దొబ్బేస్తాడు అని ఆమె ఆయన్ని పెళ్ళి చేసుకోలేదు. అతని దగ్గర వందో రెండు వందలో ఉన్నాయి.. వీడు నచ్చాడు.. కన్ను కొట్టాడు అని లవ్ చేసి స్కూటర్ ఎక్కి వచ్చింది. సనత్ నగర్ టెంపుల్ లో మూడు ముళ్ళు వేస్తే బయలుదేరి వచ్చేసింది. మన వాడు స్టార్ అయిన తర్వాత చాలామంది వచ్చారు కానీ.. ముందు వచ్చింది మాత్రం ఈ మహాతల్లే" అని చెప్పారు. బండ్ల వ్యాఖ్యలకు లావణ్య భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. "దేశమంతా కళ్ళాపి చల్లాడు కానీ ఇంటి ముందు చల్లడానికి టైం లేదు అనే సామెత ఉంది. పూరీ అన్న ఎందరినో స్టార్లను చేశాడు.. సూపర్ స్టార్లను చేశాడు.. డైలాగులు రాని వాళ్లకి డైలాగులు నేర్పించాడు. డాన్స్ రాని వాళ్లకి డాన్స్‌లు నేర్పించాడు.. మామూలు వాళ్లని స్టార్లు చేశాడు.. సూపర్ స్టార్లు చేశాడు. కానీ కన్న కొడుకు సినిమా ఫంక్షన్ కి మాత్రం రాలేదు" అని వ్యాఖ్యానించారు.