Begin typing your search above and press return to search.
బండ్ల బాబు నెక్ట్స్ ఏంటీ?
By: Tupaki Desk | 16 Jan 2020 8:53 AM GMTకమెడియన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బండ్ల గణేష్ అదృష్టం కొద్ది పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో నిర్మాతగా మారాడు. చేసినవి కొన్ని సినిమాలే అయినా పెద్ద హీరోలతో చేశాడు. తన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ కావాలని గట్టిగా కోరుకునే వాడు. దాంతో బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ అంటూ పేరు పడిపోయింది. వరుసగా ఫ్లాప్ ల వల్ల నిర్మాతగా నష్టాలు చవిచూశాడు. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవ్వడంతో నిర్మాణంకు దూరం అయ్యాడు.
నిర్మాతగా సినిమాలు చేయక చాలా కాలం అయ్యింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నటుడిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు బండ్ల బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సిద్దం అయ్యాడు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా అంటే ఎంటర్ టైన్ మెంట్ కు కొదువ ఉండదు. అలాంటి దర్శకుడు ఒక మంచి పాత్రను తనకు ఇచ్చాడని సరిలేరు నీకెవ్వరు చిత్రంలోని కీలకమైన ట్రైన్ ఎపిసోడ్ లో తాను కనిపించబోతున్నట్లుగా బండ్ల గణేష్ చెప్పాడు. ట్రైలర్ లో కూడా బండ్ల గణేష్ మ్యాటర్ ఉన్న పాత్ర చేసినట్లుగా చూపించారు.
తీరా సినిమా విడుదలైన తర్వాత బండ్ల గణేష్ పాత్ర సినిమాలో చాలా తక్కువగా ఉంది. షూటింగ్ సమయంలో బండ్ల గణేష్ పై చాలా సీన్స్ చిత్రీకరించారట. కాని చివరకు అందులో సగం కూడా ఫైనల్ ఎడిటింగ్ తర్వాత ఉంచలేదు అంటూ ఆయన సన్నిహితుల వద్ద వాపోతున్నాడట. చిన్నా చితకా కామెడీ సీన్స్ చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. చాలా ఆశలు పెట్టుకుని చివరకు ఉసూరుమనాల్సి వస్తుంది. వీటిని భరిస్తేనే కమెడియన్ గా ముందుకు సాగగలరు. మరి బండ్ల గణేష్ వీటికి ఓకే అనుకుని ముందుకు సాగుతాడా అనేది చూడాలి. బండ్ల గణేష్ నెక్ట్స్ ఏంటీ అనేది ఆయనే చెప్పాలి.