Begin typing your search above and press return to search.
బండ్ల బాబు అంత బరువు మోసేనా?
By: Tupaki Desk | 24 Jun 2019 12:48 PM GMTనటుడిగా కెరీర్ ఆరంభించి నిర్మాతగా కూడా మారిన బండ్ల గణేష్ తక్కువ సమయంలోనే కనిపించకుండా పోయాడు. నిర్మాతగా ఎన్నో చిత్రాలను నిర్మించిన ఆయనకు ఎక్కువ శాతం సినిమాలు నష్టాలను మిగిల్చాయి. దాంతో గత కొంత కాలంగా సినిమాలను వదిలేసి పూర్తిగా వ్యాపారం చేసుకుంటూ ఉన్న బండ్ల గణేష్ మళ్లీ సినిమా రంగంలోకి రీ ఎంట్రీ ఇస్తాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. మొదట నటుడిగా బండ్ల బాబు రీ ఎంట్రీ అన్నారు. ఇప్పుడు నిర్మాతగా బండ్ల రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రం వచ్చింది. ఆ సినిమాను బండ్ల గణేష్ నిర్మించాడు. ఆ సన్నిహిత్యంతోనే వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతుందని టాక్ వినిపిస్తుంది. చాలా ఏళ్లుగా కృష్ణవంశీ 'రుద్రాక్ష' అనే హర్రర్ లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని చేయాలని ఆశ పడుతున్నాడు. దిల్ రాజును ఒప్పించినప్పటికి ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో దిల్ రాజు తప్పుకున్నాడు. మళ్లీ ఇప్పుడు ఆ సినిమాను తాను నిర్మిస్తానంటూ బండ్ల గణేష్ ముందుకు వచ్చాడంటూ వార్తలు వస్తున్నాయి.
బండ్ల గణేష్ ఆర్థిక పరిస్థితి బాగాలేదనే టాక్ ఉంది. ఇలాంటి సమయంలో రుద్రాక్ష మూవీని బండ్ల గణేష్ ఏ మేరకు నిర్మించగలడనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో గంట పాటు గ్రాఫిక్స్ వర్క్ ఉంటుందట. అంటే భారీ మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి భారీ బడ్జెట్ మూవీని ఇప్పుడున్న పరిస్థితుల్లో బండ్ల గణేష్ మోయగలడా అనేది అనుమానమే. అసలు ఈ వార్తల్లో నిజం ఎంత అనే విషయంపై కూడా క్లారిటీ రావాల్సి ఉంది.