Begin typing your search above and press return to search.
పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ లకు హిట్లిచ్చింది నేనే : బండ్ల గణేష్
By: Tupaki Desk | 4 Jan 2023 10:53 AM GMTబండ్ల గణేష్ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు లేరు. తను సినిమాలు నిర్మించి ఏడేళ్లకు పైనే అవుతోంది. అయినా సరే బండ్ల గణేష్ నిత్యం వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నాడు. సినిమాల నిర్మాణం కోసం స్టార్ హీరోల్లో ఎవరూ బండ్ల గణేష్ కు డేట్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపించకపోవడంతో చాలా వరకు ఇన్వెస్టర్స్ కూడా అతనికి దూరంగా వుంటూ వస్తున్నారనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బండ్ల గణేష్ నిత్యం ఏదో ఒక అంశం కారణంగా వార్తలలో నిలుస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు.
ఆ మధ్య 'చోర్ బజార్' ఆడియో రిలీజ్ కార్యక్రమంలో పూరి జగన్నాథ్ పై సంచలన వ్యాఖ్యలు చేసి చీవాట్లు తిన్న బండ్లన్న రీసెంట్ గా రవితేజ నటించిన 'ధమాకా' సక్సెస్ సెలబ్రేషన్స్ లో పాల్గొని మెగాస్టార్ లు, సూపర్ స్టార్లు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దానికి కమెడియన్ షకలక శంకర్ కౌంటర్ ఇవ్వడం తెలిసిందే. తాజాగా మరో వివాదానికి తెరలేపాడు బండ్ల గణేష్. ఓ యూట్యూబ్ ఛానల్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చిన బండ్లన్న పవన్ కల్యాణ్, ఎన్టీఆర్ లకు హిట్లిచ్చింది నేనే అన్నాడు.
దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పూరి జగన్నాథ్ తో తనకు ఎలాంటి మనస్పర్థలు లేవని చెప్పిన బండ్ల గణేష్ తన ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ అని, పూరి అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు.
అంతే కాకుండా ఎన్టీఆర్ కు తనకు మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందని అడిగితే ఆసక్తికరమైన అంశాన్ని వెల్లడించాడు. పవన్ కల్యాణ్ , ఎన్టీఆర్ గారి జీవితాల్లో గుర్తుండిపోయే సినిమాలు తీసిన నిర్మాతగా నేను గర్వపడుతుంటానన్నాడు.
నేను చేసిన 'టెంపర్' తరువాత ఎన్టీఆర్ కు ఫ్లాప్ రాలేదు. అంతకు ముందు ఎన్టీఆర్ ఫ్లాపుల్లో వున్నాడు. నేను తీసిన 'టెంపర్' తరువాతే ఆయనకు ఫ్లాప్ లేదు. పవన్ కల్యాణ్ గారికి పదేళ్ల తరువాత ఆయన దయతో 'గబ్బర్ సింగ్' చేశాను. ఈ సినిమా తరువాత ఆయన స్థాయి ఎక్కడికి వెళ్లింది? ..ఈ రోజు ఆయన రాష్ట్రాలని గడగడలాడించే స్థాయిలో వున్నారు. అవన్నింటికీ మూలం నేను. ఆ విషయంలో గర్వపడతాను. ఎన్టీఆర్ తో నాకు ఎలాంటి గొడవలేదు. ఆయనే అర్థం చేసుకుంటాడు. గణేష్ ఇచ్చిన 'టెంపర్' తరువాత మనకు ఫ్లాప్ లేదని ఆయనకు అనిపిస్తుందన్నాడు.
ఇక పవన్ కల్యాణ్ గురించి మరోసారి మాట్లాడుతూ .. పవన్ కల్యాణ్ లో విపరీతమైన టాలెంట్ అంతా వుంది. ఈయన మామూలు మనిషి కాదురా బాబూ.. అతీతమైన ఆయన..ఈయన వేరు..వేరే స్థాయిలో వుండాలి అని అనుకుంది నేను. ఈ రోజుకీ హీరోగారంటే ఆ కృతజ్ఞత వుంటుంది. అదే కృతజ్ఞతని వాళ్లు నామీద చూపించాలని నేను అనుకోను. నేను అనుకున్నట్టుగా వాళ్లు కూడా అనుకోవాలని రూల్ ఏముంది అంటూ చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్. ప్రస్తుతం బండ్లన్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బండ్లన్న వ్యాఖ్యలపై ఫ్యాన్స్ కూడా కౌంటర్లు వేస్తున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.